గుజరాత్‌లోని సూరత్‌లో భారీ అగ్నిప్రమాదం


Gujarat_fire_accident2గుజరాత్: గుజరాత్‌లోని సూరత్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సహారా దర్వాజా ప్రాంతంలోని బహుళ అంతస్థుల ఆర్చిడ్ భవంతి నుంచి ఉదయం 9-10 గంటల మధ్య పెద్దఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఈ భవనంలోని పలు అంతస్థులను వస్త్రదుకాణాల యజమానులు సరుకు నిల్వ చేసే గోదాములుగా ఉపయోగించుకుంటున్నట్లు తెలుస్తోంది. దాంతో ఆస్తినష్టం భారీగా ఉండవచ్చని అంచనా. 20 అగ్నిమాపక యంత్రాలు మంటలను ఆర్పేందుకు తీవ్రంగా కృషిచేస్తున్నాయి. ప్రమాదంలో ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం రాలేదు.

Leave a Comment