గుణశేఖర్ కోసం ఎదురు చూస్తున్న చిరంజీవి !

చిరంజీవి నటించబోయే 150వ సినిమాకు సంబంధించి ఒక ఆశక్తికర వార్త ఫిలింనగర్ లో హడావిడి చేస్తోంది. ప్రస్తుతం అనుష్క తో ‘రుద్రమదేవి సినిమాను అత్యంత భారీ స్థాయిలో తీస్తున్న గుణశేఖర్ చెప్పిన కథ గురించి చిరంజీవి ఆలోచన చేస్తున్నాడు అని టాక్.  ఇక వివరాలలోకి వెళితే గుణశేఖర్ అల్లుఅర్జున్ తో ‘వరుడు’ సినిమాను తీస్తున్న సమయంలో చిరంజీవికి ఒక కథను చెప్పాడట. ఆ కథ చిరంజీవికి బాగా నచ్చడంతో ఆ సినిమా గురించి అప్పట్లో ఆలోచన కూడా చేసాడట. అయితే రాజకీయాలలోకి వచ్చేసిన తరువాత ఆ కథను అదేవిధంగా గుణశేఖర్ ను పూర్తిగా మర్చిపోయాడు చిరంజీవి.  అయితే రాజకీయాలలో తీరిక దొరికి తిరిగి సినిమాల గురించి ఆలోచన చేస్తున్న చిరంజీవికి అనుకోకుండా చాల సంవత్సరాల క్రితం గుణశేఖర్ చెప్పిన కథ గుర్తుకు వచ్చింది అని అంటున్నారు. చిరంజీవి ఇమేజ్ కు తగ్గట్టుగా ఉండే ఆ కథను ఇప్పటి పరిస్థుతులకు అనుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు చేసి తీస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన చిరంజీవి మనసులో ఉంది అని అంటున్నారు.  ఒకప్పుడు చిరంజీవి తో  ‘చూడాలని ఉంది’ లాంటి బ్లాక్ బస్టర్ తీసిన గుణశేఖర్ ప్రస్తుతం బాగా వెనుక పడిపోయినా ‘రుద్రమదేవి’ ఇచ్చే విజయాన్ని బట్టి గుణశేఖర్ కథకు మెగా కాంపౌండ్ లో కదలిక వచ్చే అవకాసం ఉంది అని అంటున్నారు..

Leave a Comment