ఆండ్రాయిడ్…ప్రపంచ వ్యాప్తంగా వినియోగంలో ఉన్న సాప్ట్ వేర్. అయితే దీనిని ఎవరు తయారు చేశారు.? ఎప్పుడు తయారు చేశారు…? అని తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్లకుపైగా సాంకేతిక పరికరాల్లో వినియోగంలో అన్నీ ఫోన్లకూ ఆండ్రాయిడ్ వసతి ఉంటుంది. మొదట్నుంచీ గూగుల్ సంస్థే దాన్ని తయారు చేసిందనకుంటారంతా. కానీ దాదాపు పన్నెండేళ్ల క్రితం ఆండీ రుబీన్ అనే వ్యక్తి దాన్ని రూపొందించాడు. మనోడికి రోబోల పిచ్చి ఉండటంతో అతని స్నేహితులంతూ సాప్ట్ వేర్ కు ఆండ్రాయిడ్ (మనిషిలా కనిపించే రోబో) అన్న పేరు పెట్టమన్నారు. నిజానికి దీని మోబైల్స్ లో ఫోటోలను డౌన్ లోడ్ చేసుకోవడానికే తయారు చేశాడు. అది భవిష్యత్తులో అద్భుతాన్ని సృష్టిస్తుందని ఊహించిన రుబిన్. గూగుల్ సంస్థకు అమ్మేశాడు. అ తరువాత నుంచి గూగుల్ దాన్ని అప్ డేట్ చేస్తూ వస్తోంది. మొదటి వెర్షన్ కు ‘ఆస్ట్రోబాయ్’ అని సరదాగా పేరు పెట్టిన గూగుల్ ఆ తరువాత వచ్చిన వాటికి కూడా కప్ కేక్,డోనట్,ఎక్లయిర్స్, ప్రోయో,జింజర్ బ్రెడ్, హనీ కోంబ్, ఐస్ క్రీమ్ శాండ్ విచ్, జెల్లీ బీచ్ ఇలా ఆహార పదార్ధాల పేర్లూ..అదీ ఆంగ్ల అక్షర క్రమంలోని మొదటి అక్షరంతో మొదలయ్యే పేర్లే పెడుతూ రావడం విశేషం.
Recent Comments