గొంతుకే కాదు, కళ్ళకు కూడా మిరియాలు…

గొంతు పెగలాలంటే మిరియంతో ఎల్లకాలాలూ నోరు కాలాలి. అందుకే హరికథకులు పాలతో పాటు మిరియాలు తీసుకుంటారు. గొంతుకే కాదు సుమా.. కళ్లకూ మిరియాలు మంచివే. ఎందుకంటే ట్యూటిన్, జియాగ్జాంథిన్, యాంటీఆక్సిడెంట్స్ ఉండి వాటితో కళ్లకు సంబంధించిన సమస్యలైన మాక్యులార్ డీజనరేషన్‌తో వచ్చే చూపు కోల్పోయే ప్రమాదాన్ని నివారిస్తుంటాయి. ఇలా అంధత్వ సమస్యలపై ఎప్పుడూ కారాలు నూరుతుంటాయి మిరియాలు. పైగా అందులోని ఫినోలిక్ యాసిడ్స్ క్యాన్సర్‌కు కారణమయ్యే నైట్రోసోయమైన్స్‌ను కరిగించివేస్తాయి. ఇలా చూస్తే క్యాన్సర్‌కు కవచం… మన మిరియం.

Leave a Comment