గోళ్ళు కొరకడం మానండి..

చాలా మందిలో గోళ్ళు కొరికే అలవాటు బాగా కనపడుతుంది. ఇలా గోళ్ళు కొరకకూడదని తెలిసినా, లేదా పెద్దలు చెప్పినా వినిపించుకోరు. మన పెద్దవాళ్ళైతే ఇందుకు ఓ ఫిలాసఫీ నే చెబుతారు. అలా చేస్తే అరిష్టమనీ.. జీవితానికి చాలా సమస్యలొస్తాయని చెబుతారు కూడా. ఏదిఏమైనా ఒక సైంటిఫిక్ విషయమేమంటే గోళ్ళ చివరినుంచి ప్రతికూల శక్తి బయటకి వెళ్తుంటుంది. వాటిని నోటిలో పెట్టి కొరకటం వల్ల ఆ ప్రతికూల శక్తి తిరిగి మన లోపలకి ప్రవేశిస్తుంది. అదేకాక మనం ఎంత శుభ్రం చేసినా గోళ్ళల్లో మట్టి, సూక్ష్మక్రిములు వుంటూ వుంటాయి. ఇవ్వి లోపలకి వెళ్ళి అనారోగ్యం కలిగిస్తాయి. పిల్లలు ఒక్కోసారి వాటిని మింగేయవచ్చు. అరుదుగా ఇవ్వి పేగులలో ఎక్కడైనా గుచ్చుకుని ఒక్కోసారి ఆపరేషన్ దాకా వెళ్ళచ్చు. ఇన్ని విధాల మనకి నష్టం కలిగిస్తుంది కనుకే గోళ్ళు కొరకటం అరిష్టం అంటారు. అసలు గోళ్ళు ఎలా పెరుగుతాయి, వాటి వల్ల ఇంఫెక్షన్స్ ఎలా వస్తాయో తెలుసుకుందామా..!

 

1. గోళ్ళు ప్రాణం ఉన్నంత వరకూ పెరుగుతూనే ఉంటాయి. ఈ పెరుగుదలలో మనిషికి మనిషికీ కొంత వ్యత్యాసం ఉంటుంది.

2. చేతిగోళ్ళు రోజుకు సుమారు 0.1 మి.మీ. పెరుగుతాయి. కాలిగోళ్ళు ఇందులో కేవలం మూడో వంతు మాత్రమే పెరుగు తాయి.

3. పగటివేళ, వేసవికాలం, మగ వాళ్ళలో, గర్భవతులలో చేతివేళ్ళు, ముఖ్యంగా మధ్యలోని మూడువేళ్ళ గోళ్ళు వేగంగా పెరుగుతాయి.

4. రాత్రుళ్ళు, ముసలితనం, శీతాకాలం, గోళ్ళ వేగం తగ్గుతుంది. జ్వరం, కొన్ని మందులు, థైరాయిడ్‌ సమస్యలు, పోషకాహార లోపం మొ|| పెరుగుదల తగ్గిస్తాయి.

గోళ్ళ పని ఎంటంటే: వ్రేళ్ళకొనలను కాపాడటం, స్పర్శ కనుగొనటం, మనిషి అందం పెంచడం, దురద ఉన్నప్పుడు గోకడం.

 

గోళ్ళకు వచ్చే జబ్బులు :

1. పుట్టుకతోనే కొన్ని జబ్బులు గోళ్ళు కలిగిఉంటాయి. వంశపారం పర్యంగా కొన్ని గోళ్ళ జబ్బులు వస్తాయి గోళ్ళు లేకుండా జన్మించడాన్ని ”అనోనైభియా” అంటారు.

2. కొందరిలో ఒకే వేలికి రెండు, మూడుగోళ్ళు ఉంటాయి. కొందరిలో గోళ్లు వేలి చివర వరకు పెరగవు.

3. కొందరిలో గోళ్లు కేవలం పలుచని పొరలాగా ఉండి, తరచూ ఊడిపోతూ ఉంటాయి.

4. గోరుకు, వేలి కొనకు మధ్య ఉన్న భాగం ఆకృతి మారి ఉబ్బినట్లు ఉండటాన్ని ”క్లబ్బింగ్‌” అంటారు. ఇది ఉన్నట్లయితే అంతర్గతం గా ఉన్న అనేక రుగ్మతలకు సూచిక. సోరియాసిస్‌, లైఖన్‌ప్లానస్‌ వంటి చర్మవ్యాధులు గోళ్ళకు సోకుతాయి.

అంతేకాక అనేక ఫంగస్‌ వ్యాధులు గోళ్ళకి సోకి, గోళ్ళను నాశనం చేస్తాయి. అనేక గీతలు, గుంటలు గోళ్ళపై కన్పిస్తాయి. సిఫిలిస్‌ అనే లైంగిక వ్యాధి కూడా గోళ్ళకి వ్యాపించవచ్చు.

 

గోళ్ళకు వచ్చే కొన్ని బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్స్‌ :

1. గోళ్ళ రంగును మార్చుతాయి. కొన్ని మందులు కూడా గోళ్ళ రంగును మార్చి, అంద విహీనంగా చేస్తాయి.

2. గోళ్ళమీద ఉన్న తెల్లని అడ్డగీతలు గతంలోని రుగ్మతలకు సూచిక.

3. పులిపిరులు,హెర్పిస్‌ ఇన్‌ఫెక్షన్‌ కూడా గోళ్ళకు సోకుతాయి. కొన్ని జబ్బుల వలన రక్తపు చుక్కలు గోళ్ళ క్రింద ఉంటాయి.

4. కొందరిలో గోళ్లకింద అనారోగ్య కండరం పెరిగి ఇబ్బంది కలిగిస్తే, మరి కొందరిలో గోళ్ళకింద పూర్తి ఖాళీభాగం కలిగి ఉంటుంది. విటమిన్లలోపము వలన కూడా గోళ్ళ ఆకృతి మారుతుంది. రక్తహీనత వలన గోళ్ళుస్పూను ఆకారంలోకి మార తాయి. కొన్ని గుండెజబ్బులు, కిడ్నీల జబ్బులు కూడా గోళ్ళమీద గీతలు సృష్టి స్తాయి. కొందరిలో ముఖ్యంగా కాలిబొటన వేలి గోరు లోతుగా పెరిగి, తరచూ విపరీత నొప్పిని, వాపును కలిగి వేధిస్తూ ఉంటుంది. ఇటువంటి సందర్భంలో గోరు తీసి వేయటమే మార్గము. మానసిక ఆందోళన కల్గిన వాళ్లు ముఖ్యంగా పిల్లలు గోళ్ళను కొరుకుతూ అలవాటుగా మారిపోతుంది. కొందరిలో గోళ్ళు విపరీతంగా లావుగా పెరిగి కొమ్ములు లాగా ఉంటాయి.

Leave a Comment