గౌతం మీనన్ దర్శకత్వంలో రామ్ చరణ్ కోలీవుడ్ ఎంట్రీ

హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ హీరోల్లో ఒకరిగా ఎదిగిన రామ్ చరణ్ ‘జంజీర్’ చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. త్వరలో రామ్ చరణ్ తమిళ సీని పరిశ్రమలో కూడా అడుగు పెట్టబోతున్నారు. డైరెక్ట్ 29-ramcharanతమిళ సినిమాలో నటించబోతున్నారు. ప్రముఖ తమిళ దర్శకుడు గౌతం మీనన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.అక్టోబర్ 1న తన తాజా సినిమా ‘గోవిందుడు అందరి వాడేలే’ చిత్రం విడుదల నేపథ్యంలో సోమవారం రామ్ చరణ్ మీడియాతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన తన కోలీవుడ్ ఎంట్రీ గురించి వెల్లడించారు. ‘2015లో గౌతం మీనన్ దర్శకత్వంలో డైరెక్ట్ తమిళ సినిమా చేయాలనుకుంటున్నాను’ అని రామ్ చరణ్ తెలిపారు.

ఘర్షణ, ఏమాయ చేసావె, ఎటో వెళ్లి పోయింది మనసు చిత్రాల ద్వారా గౌతం మీనన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. వాస్తవికత ఉట్టిపడేలా, వైవిద్యంగా సినిమాలు తీయడం గౌతం మీనన్ స్టైల్. ఆయన దర్శకత్వంలో రామ్ చరణ్ తమిళ సినిమా చేస్తుండటంపై ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈచిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేయనున్నారు.రామ్ చరణ్ నటించిన గోవిందుడు అందరి వాడేలే చిత్రం విషయానికొస్తే… సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈచిత్రం U/A సర్టిఫికెట్ సొంతం చేసుకుంది. రామ్ చరణ్ సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, కమిలీనీ ముఖర్జీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దర్శకుడు కృష్ణ వంశీ ఫ్యామిలీ ఎంటర్టెనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అక్టోబర్ 1న ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదలవుతోంది.

Leave a Comment