చల్లని నీటితో స్నానం ఎంతో ఆరోగ్యం

మీలో ఎంతమంది ప్రతిరోజూ చల్లని నీటితో స్నానం చేస్తారు? చల్లని ప్రదేశాలలో వుండేవారికి చన్నీటి స్నానం వెన్నెముకలో వణుకు పుట్టిస్తుంది. చన్నీటి స్నానం అంటేనే వారు ఎంతో భయపడతారు. కాని చల్లని నీటి స్నానం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలిస్తుందనేది చాలా కొద్దిమందికి తెలుసు. ప్రాచీన కాలంలో నీటితో వైద్యం లేదా హైడ్రో ధిరపీ అనేది డాక్టర్లు మందులు వాడేదానికి బదులుగా రోగాలను నయం చేయటానికి ఉపయోగించేవారు. ఛార్లెస్ డార్విన్ సైతం చల్లని నీటి వైద్యాన్ని ప్రచారం చేశాడు. ఇపుడు దీనిని ప్రపంచమంతా స్పా చికిత్సలలో వాడుతున్నారు. క్రమం తప్పకుండా రోజూ చల్లని నీటితో స్నానం చేస్తే, చాలా వ్యాధులు నివారించవచ్చు. చల్లని నీరు రక్తప్రసరణ అధికం చేసి మీ రోగ నిరోధకత పెంచుతుంది. చాలామంది వేడినీటి స్నానం కంటే కూడా చల్లని నీటి స్నానాన్ని కోరతారు. అది వారిలోని ఒత్తిడి, డిప్రెషన్ వంటివి దూరం చేస్తుందంటారు.

1. రెగ్యులర్ గా చల్లని నీటి స్నానం చేస్తే మన శరీరంలో రోగాలతో పోరాడే తెల్ల రక్త కణాలు సంఖ్య పెరుగుతుందని రోగ నిరోధక శక్తి పెరుగుతుందని రీసెర్చి చెపుతోంది. ఆ రకమైన నీటి వైద్యం మన రోగ నిరోధకతలను మెరుగుపరచి, మెటబాలిజం రేటు పెంచుతాయి. మెటబాలిజం రేటు పెరిగితే మరోమారు రోగ నిరోధక వ్యవస్ధ బలపడుతుంది.
2. కొన్నిపరిశోధనల ప్రకారం ఉదయం చేసే చన్నీటి స్నానం వల్ల సహజంగా వచ్చే జలుబును నివారించవచ్చు. కారణం ఏంటంటే శరీరం లోపల నుండి హాట్ రేడియేషన్ ప్రారంభమవుతుంది. దీని వల్ల మూసుకుపోయిన ముక్కు రంద్రాలు తెరుచుకొనేలా చేస్తుంది.
3. హాట్ టబ్ లో మీ శరీరాన్ని ముంచడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుందని అంటుంటారు. అయితే రీసెంట్ గా జరిపిన కొన్ని పరిశోధనలలో కోల్డ్ బాత్ కూడా బరువు తగ్గడానికి సహాయపడుతుందని నిర్ధారించారు. చల్లనీటి స్నానం వల్ల బ్రౌన్ ఫ్యాట్ పెరగకుండా ఉంటుందని అంటున్నారు.
4. చన్నీటి స్నానం మొదటి ప్రయోజనం రక్త ప్రసరణ పెరగటం. చల్లని నీరు శరీరానికి తగిలితే అది రక్త ప్రసరణ పెంచి గుండె ఆరోగ్యం కాపాడుతుంది. అంతేకాదు, మీలోని చర్మ కాంతి పెరిగి మీరు ఎప్పటికి తాజాగా, చిన్న వయసు వారిగా కనపడతారు.
5. చన్నీటి స్నానం వల్ల మెటబాలిక్ రేటు పెరుగుతుంది. కోల్డ్ టెంపరేచర్ మీ శరీరం యొక్క ఉష్ణోగ్రతను రీ రెగ్యులేట్ చేయడంలో బాగా సహాయపడుతుంది. ఇది అనేక క్యాలరీలను ఉపయోగించుకుంటుంది.
6. వర్జీనియా కామన్ వెల్త్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ లోని రేడియేషన్ ఆంకాలజీ డిపార్ట్ మెంట్ పరిశోధన మేరకు చల్లని నీటి స్నానం బ్రెయిన్ లోని బ్లూ స్పాట్ ను ఉత్తేజపరచి ఎడ్రినాలిన్ హార్మోన్ ను ప్రభావితం చేస్తుంది. ఇది మానవులలో డిప్రెషన్ దూరం చేస్తుంది. కనుక ఎపుడు ఒత్తిడి వున్నా లేక డిప్రెషన్ కలిగినా, చల్లని నీటి స్నానం చేసి ఔషధాల ఖర్చు లేకుండా హాయి పొందండి.
7. సాధారణ ఉష్ణోగ్రతలో మీ శరీరం పట్టే నార్మల్ చెమట కంటే వేసవిలో ఎక్కువ చెమటపట్టాలి. ఈ ఎక్సెస్ స్వెట్టింగ్(అదనపు చెమట)తగ్గించడానికి చన్నీటి స్నానం బాగా సహాయపడుతుంది. చన్నీటి స్నానం చేయడం వల్ల శరీరం యొక్క ఉష్ణోగ్రతను రెగ్యులేట్ చేస్తుంది.
8. చన్నీటి స్నానం చేయడం వల్ల ఊపిరితిత్తులు తెరుచుకొనేలా చేసి శారీర వ్యాయామంగా సహాయపడుతుంది . అందువల్ల కోల్డ్ బాత్ వల్ల ఉశ్చ్వాస నిశ్చ్వాసలు మరింత ఉత్తమంగా ఉంటుంది.
9. అలసటకు గురైనప్పుడు?ఉత్తమ మార్గం అటువంటి సమయంలో చన్నీటి స్నానం చేయడం. మిట్టమధ్యాహ్నానంలో చన్నీటి స్నానం చేయడం బెటర్ . ఈ కోల్డ్ టెంపరేచర్ మీ సెన్స్ ఆర్గాన్స్ ను తగినంత ఎనర్జీని అంధిస్తాయి.
10. చల్లని నీటితో ప్రతిరోజూ స్నానం చేస్తే, ఎండోర్ఫిన్ మరియు పురుషుల్లో టెస్టోస్టిరాన్ హార్మోనులను. వేడి నీళ్ళ స్నానం వీర్యకణాల సంఖ్యను తగ్గిస్తుంది. కనుక పురుషులు ప్రతిరోజూ వేడినీటి స్నానం చేయరాదు. వేడి నీటి స్నానం వారికి గర్భ నిరోధకంగా పనిచేస్తుంది.
11. చల్లని నీరు మన చర్మం నుండి హానికరమైన రసాయనాలను తొలగిస్తుంది. వేడినీరు చర్మ రంధ్రాలను తెరిస్తే, సరిగ్గా దానికి వ్యతిరేకంగా చల్లని నీరు పనిచేస్తుంది. చర్మ రంధ్రాలు మూసుకుంటే మురికి అక్కడ పేరుకోదు. చర్మం శుభ్రంగా వుండి, మొటిమలవంటివి రాకుండా వుంటాయి.
12. చల్లని నీటి స్నానం మీ వెంట్రుకలు నల్లగా మెరవటమే కాక, జుట్టు రాలకుండా, చేస్తుంది. డాండ్రఫ్ లేదా చుండ్రు రాకుండా తల పై భాగాన్ని కాపాడుతుంది.
13.  రీసెర్చ్ ప్రకారం పురుషులు అరగంట పాటు మూడు వారులు క్రమంగా వేడి నీటి స్నానం ఎవరైతే చేస్తారో వారిలో మరో ఆరు నెలల పాటు వంధ్యత్వం సమస్యలు ఏర్పడుతాయి. కాబట్టి ప్రత్యుత్పత్తి బెటర్ గా ఉండాలంటే చన్నీటి స్నానం ఎంపిక చేసుకోవాలి . ఉదయం చేసే చన్నీటి స్నానం మరింత ఆరోగ్యకరం మరియు ప్రయోజనకరం.

Leave a Comment