చాయివాలా నుంచి..సీఎం గా ప్రమాణ స్వీకారం

తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు మరి కొంత మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో వీరందరిచేత ఆ రాష్ట్ర గవర్నర్ రోశయ్య ప్రమాణ 1411991456Jaya_Panner-Selvam-new-CMస్వీకారం చేయించారు. ప్రమాణం చేస్తూ ఉద్వేగానికి లోనైన పన్నీర్ సెల్వం కంటతడి పెట్టారు.

తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత వారసుడు పన్నీర్ సెల్వం ప్రమాణస్వీకారం చేశారు. రాజ్ భవన్ లో ఏ మాత్రం హడావుడి లేకుండా… సాధారణంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. పన్నీర్ సెల్వంతో పాటు, పలువురు మంత్రులతో గవర్నర్ రోశయ్య ప్రమాణ స్వీకారం చేయించారు.

ప్రమాణ స్వీకారం సందర్భంగా పన్నీర్ సెల్వం, ఇతర మంత్రులు భావోద్వేగానికి గురయ్యారు. కంటతడి పెట్టారు. వాళ్లలో ప్రతి ఒక్కరూ జయలలితకు వీరాభిమానులు, ఒకరకంగా పాదాక్రాంతులే. అందుకే.. సీఎం దగ్గర నుంచి మంత్రుల వరకు అందరూ ఒక్కసారిగా ఏడ్చేశారు. కొంతమంది ఎమ్మెల్యేలు కూడా కళ్లనీళ్లు కక్కుకున్నారు. వైద్యలింగం, వలార్‑మత్తి,తంగమణి.. ఇలాంటి సీనియర్లు కూడా ఏడుపు ఆపుకోలేకపోయారు. దాంతో అక్కడ ప్రమాణస్వీకార కార్యక్రమం కాస్తా సంతాప కార్యక్రమంలా కనిపించింది.

మాజీ ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత విశ్వాసపాత్రుడైన 63ఏళ్ల పన్నీర్ సెల్వం.. అనుకోకుండా రెండుసార్లు తమిళనాడుకు ముఖ్యమంత్రి అయ్యారు. పన్నీర్ సెల్వం ఒక టీస్టాల్ యజమాని. ఆయన కుటుంబానికి చెందినవాళ్లు ఇప్పటికీ ఆ టీ దుకాణాన్ని నడిపిస్తున్నారు. మదురై ప్రాంతంలో బాగా ప్రభావవంతమైన దేవర్ వర్గానికి చెందిన ఆయన..1996లో పెరియంకుళం మునిసిపాలిటీకి ఛైర్మన్‑గా రాజకీయాల్లోకి ప్రవేశించారు. జయలలితకు అత్యంత ఆప్తమిత్రురాలైన శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్‑తో సన్నిహిత సంబంధాలు ఉండటం పన్నీర్‑కు బాగా కలిసొచ్చింది.2001లో పెరియంకుళం నుంచి తొలిసారి ఎమ్మెల్యే కాగానే రెవెన్యూ మంత్రి పదవి దక్కించుకున్నారు. అదే సంవత్సరంలో జయలలిత రాజీనామా చేయాల్సి వచ్చినప్పుడు ఆయనే ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత మళ్లీ జయలలిత అధికారంలోకి వచ్చినా.. ప్రభుత్వంలో నెంబర్ 2 హోదాను పన్నీర్ సెల్వం అనుభవించారు.

Leave a Comment