చాలా తప్పులు చేశాం, ప్రజలకు దూరమయ్యాం

chidambaramన్యూఢిల్లీ :  యుపిఎ ప్రభుత్వ హయాంలో 2010-11 సంవత్సరాలు చాలా కీలకమైనవని ఆర్ధిక మంత్రి చిదంబరం పేర్కొన్నారు. ఆ సమయంలో ఢిల్లీ వీధుల్లో, ఇంకా అనేక చోట్ల అవినీతి వ్యతిరేక నిరసనలు వెల్లువెత్తాయని ఆ సమయంలో ప్రజాగ్రహాన్ని తట్టుకోవడం కూడా కష్టమైందన్నారు. ఆ కీలకమైన సంవత్సరాల ఫలితం రాబోయే ఎన్నికల్లో కనిపిస్తుందన్నారు. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ శేఖర్‌ గుప్తాతో చిదంబరం మాట్లాడారు. 2009లో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్‌ సరైన గుణపాఠాలను నేర్చుకోలేదని చిదంబరం అన్నారు. తాము కొన్ని తప్పులు చేశామని, అయితే తదనంతరకాలంలో వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయలేదన్నారు. ఆ తప్పులను గమనించి వాటిని దిద్దుకుని సరైన చర్యలు తీసుకుంటే పరిస్థితి బాగుండేదని అన్నారు. కేవలం ప్రభుత్వమే కాదు, మొత్తంగా రాజకీయ వర్గమే విఫలమైందన్నారు. ప్రజల మారుతున్న భావాలకు అనుగుణంగా వ్యవహరించడంలో రాజకీయ పార్టీలు విఫలమయ్యాయన్నారు. చాలా అవకాశాలను పోగొట్టుకున్నామని వెనక్కి తిరిగి చూసుకుంటే తెలుస్తోం దన్నారు. చాలా ముఖ్యమైన తప్పులనే చేశామన్నారు.

Leave a Comment