చిరంజీవి ఆపగలరా ?

కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశవ్యాప్తంగా కాషాయాన్ని విస్తరింపచేయడం కోసం ప్రధాని నరేంద్ర మోడీ పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా బీజేపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా విస్తరించేందుకు అన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే ఎన్నికలకు ముందు.. ఎన్నికల తరువాత అనేక మంది నేతలు బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందే పురందీశ్వరీ బీజేపిలో చేరింది. ఇక ఎన్నికల అనంతరం కన్నా లక్ష్మీనారాయణ బీజేపిలో చేరారు. కాంగ్రెస్ నుంచే కాకుండా… వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా వలసలు ఉంటున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే ఆ పార్టీనుంచి కొణతాల బయటకి వచ్చేశారు. కొణతాల త్వరలోనే బీజేపి తీర్ధం పుచ్చుకోనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక.. అదే పార్టీకి చెందిన ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి…ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడిని.. ప్రధాని నరేంద్ర మోడిని పొగడ్తలలో ముంచేస్తున్నారు. ఈ విషయాన్ని బట్టి చూస్తే.. మేకపాటి కూడా వైకాపా ను వీడి భాజాపా తీర్ధం పుచ్చుకుంటారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక రాష్ట్ర విభజన అనంతరం.. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఘోరంగా దెబ్బతిన్నది. ఇప్పుడు ఆ పార్టీలో చిరంజీవి ఒక్కరే.. చరిష్మా ఉన్న నాయకుడు. 2019 ఎన్నికలే లక్ష్యంగా భాజాపా ఇప్పటినుంచే గెలుపు గుర్రాలకోసం వేటను ప్రారంభించింది. ముఖ్యంగా దక్షిణ భారత దేశంలోని ఐదు రాష్ట్రాలలో పాగా వేయాలని ఆ పార్టీ భావిస్తున్నది. మరి.. ఘోరంగా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ నుంచి వలసల్ని రాజ్యసభ సభ్యుడు.. కాంగ్రెస్ నేత చిరంజీవి ఏమాత్రం ఆపగలుగుతాడు అన్నది చూడాలి.

Leave a Comment