చిలీ శుభారంభం

chiliమ్యాన్ ఆఫ్ ద మ్యాచ్: సాంచెజ్ (చిలీ)
 ఆడిన నిమిషాలు: 90; ఇచ్చిన పాస్‌లు: 43
 చేసిన గోల్స్: 1; గోల్ పోస్ట్‌పై షాట్స్: 2
 
 చిలీ : 3
 సాంచెజ్ : 12 వ ని.
 వాల్డివియా: 14వ ని.
 బిసేజర్: 92వ ని.
 ఆస్ట్రేలియా : 1
 కాజిల్: 37వ ని.)
 
 క్యూయాబా: గ్రూప్-బిలో జరిగిన మరో మ్యాచ్‌లో చిలీ 3-1తో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. ఆరంభం నుంచి మంచి సమన్వయంతో కదిలిన చిలీ ఆటగాళ్లు కంగారూలపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించారు.
 
 అలెక్సీస్ సాంచెజ్ (12వ ని.), వాల్డివియా (14వ ని.), బిసేజర్ (92వ ని.) చిలీకి గోల్స్ అందిస్తే… కాజిల్ (37వ ని.) ఆసీస్ తరఫున ఏకైక గోల్ చేశాడు. తొలి అర్ధభాగానికి 2-1 ఆధిక్యంలో నిలిచిన చిలీ… మ్యాచ్ చివర్లో ఇంజ్యురీ టైమ్‌లో మూడో గోల్ చేసింది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ డిఫెన్స్ లోపంతో మూల్యం చెల్లించుకుంది. 1962 తర్వాత ప్రపంచకప్‌లో చిలీకి ఇదే మెరుగైన ప్రదర్శన.

Leave a Comment