చెర్రీ, బన్నీతో మణిరత్నం చర్చలు?

హైదరాబాద్: ఇది నిజంగానే మెగా హాట్ న్యూస్. ప్రముఖ దర్శకుడు మణిరత్నం హైదరాబాద్ వచ్చారు. ఆయన మెగా ఫ్యామిలీ హీరోలైన రామ్ చరణ్ తేజ్, అల్లు అర్జున్‌తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ ఇద్దరు మెగా 21-ram-charan-bunny-mani-600హీరోలతో కలిసి మణిరత్నం సినిమా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఫిల్మ్ నగర్లో ఈ విషయం ఇపుడు హాట్ టాపిక్ అయింది.ఇంతకు ముందు మణిరత్నం నాగార్జున, మహేష్ బాబులతో ఓ సినిమా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రాజెక్టు పలు కారణాలతో ఉన్నట్టుండి రద్దయింది. నాగార్జున, మహేష్ బాబులతో చేయాల్సిన సినిమానే ఇపుడు…….రామ్ చరణ్, అల్లు అర్జున్‌తో మణిరత్నం ప్లాన్ చేస్తున్నట్లు టాక్.
మెగా హీరోల నుండి గ్రీన్ సిగ్నల్ అందితే ఈ ప్రాజెక్టు విషయాలను మణిరత్నం అఫీషియల్‌గా వెల్లడించే అవకాశం ఉంది. దీన్ని ఆయన తెలుగు, తమిళం ద్విబాషా చిత్రంగా ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. సాధారణంగా మణిరత్నం సినిమాలంటేనే విభిన్నంగా ఉంటాయి. అందుకే ఈ న్యూస్ హాట్ టాపిక్ అయింది.ఇప్పటికే రామ్ చరణ్, అల్లు అర్జున్ కలిసి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ‘ఎవడు’ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఈచిత్రం బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఇక మణిరత్నం దర్శకత్వంలో ఈ ఇద్దరు కలిసి నటిస్తే అంచనాలు భారీగా ఉండటం ఖాయం అంటున్నారు.

Leave a Comment