చైనా పర్యటనకు ఉపరాష్ట్రపతి అన్సారీ

Hamid Ansariన్యూఢిల్లీ: భారత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ఈ నెలలో చైనా పర్యటనకు వెళ్లనున్నారు. భారత్, చైనాల మధ్య పంచశీల ఒప్పందం ఏర్పడి 60 ఏళ్లయిన సందర్భంగా ఈ నెల 28న జరిగే ప్రత్యేక స్మారకోత్సవంలో అన్సారీ పాల్గొంటారు.

ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత చైనాలో భారత్ ఉన్నత స్థాయి ప్రతినిధి పర్యటించడం ఇదే తొలిసారి. బీజింగ్లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో అన్సారీ పాల్గొంటారని అధికార వర్గాలు తెలిపాయి. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఇటీవల భారత పర్యటనకు వచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ సహా ఇతర మంత్రులతో సమావేశమయ్యారు. చైనా పర్యటనకు రావాల్సిందిగా వాంగ్ ఆహ్వానించగా, మోడీ సుముఖత వ్యక్తం చేశారు. కాగా తేదీలు ఇంకా ఖరారు కావాల్సివుంది.

Leave a Comment