జగన్‌పార్టీపై మండిపడ్డ పురంధేశ్వరి

04-purandeswari30-300హైదరాబాద్/కడప: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పైన మాజీ కేంద్రమంత్రి, భారతీయ జనతా పార్టీ రాజంపేట లోకసభ అభ్యర్థి పురంధేశ్వరి మండిపడ్డారు. గురువారం ఆమె కడప జిల్లా రాజంపేటలో గాయపడ్డ టిడిపి, బిజెపి కార్యకర్తలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.వైయస్సార్ కాంగ్రెసు దాడులకు వెరవకుండా నిలబడిన టిడిపి, బిజెపి కార్యకర్తలకు ఆమె అభినందనలు తెలిపారు. జగన్ పార్టీ అక్రమాలకు తెగబడిందన్నారు. ఎన్నికల్లో తమకు మద్దతుగా నిలబడిన కార్యకర్తలకు తాము అండగా ఉంటామన్నారు. తమకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Comment