జగన్ ఆస్తుల కేసులో 11వ ఛార్జిషీట్

వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌ రెడ్డి ఆస్తుల కేసులో సీబీఐ కోర్టు 11వ ఛార్జిషీటును విచారణకు తీసుకుంది. ఇందూ నిర్మాణ ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐ రూపొందించిన చార్జిషీటును కోర్టు స్వీకరించింది. ఈ కేసు విచారణ నిమిత్తం డిసెంబర్ 19న విచారణకు హాజరుకావాలని జగన్‌కు సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. ఇందూ గృహ నిర్మాణ ప్రాజెక్టులపై ఛార్జిషీట్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు ఇందూ శ్యామ్ ప్రసాద్‌రెడ్డి, వీవీ కృష్ణ ప్రసాద్, జితేంద్ర వీర్వాణిలతోపాటు విజయసాయిరెడ్డి, ఐఏఎస్ అధికారి ఎస్‌ఎన్ మహంతిలకు సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. డిసెంబర్ 19న కోర్టుకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది.

Leave a Comment