జాతీయపార్టీగా టిడిపి:మహానాడులో తీర్మానం

TDPహైదరాబాద్: తెలుగుదేశం పార్టీని జాతీయ పార్టీగా ఆమోదించాలని మహానాడులో తీర్మానించారు. ఈ తీర్మానాన్ని ఆ పార్టీ సీనియర్ నేత  యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టారు. ఏకగ్రీవంగా ఆమోదించారు.

వచ్చే ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీగా అవతరిస్తుందన్న ధీమాను పార్టీ అదినేత చంద్రబాబు నాయుడు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. జాతీయపార్టీ కావాలంటే మూడు నాలుగు రాష్ట్రాలలో  సగటున ఆరు శాతం ఓట్లు తెచ్చుకోవలసి ఉంటుంది.  ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీగా నమోదైన టీడీపీ ఇప్పటివరకు అలాగే కొనసాగింది.

 రాష్ట్ర విభజన జరిగింది.  ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో సైకిల్ గుర్తుపై పోటీ చేయాలంటే, దానికి జాతీయ పార్టీ గుర్తింపు కావాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఆ పార్టీ ఆరు  శాతం ఓట్లు సాధించడం పెద్ద కష్టమేమీ కాదు.  మరో రాష్ట్రంలో ఆరు శాతం ఓట్లను సాధించడమే ఇబ్బంది. అయితే  ఇందు కోసం ఆ పార్టీ పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటకలతోపాటు  తెలుగువారి అధికంగా ఉన్న పాండిచ్చేరి, అండమాన్ నికోబార్ వంటి చోట్ల కూడా  ఎన్నికల్లో పోటీచేయాలన్న ఆలోచనతో ఉంది.

Leave a Comment