జూన్ 2: జగన్, చంద్రబాబులకు కెసిఆర్ ఆహ్వానం!

5హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న తెరాస అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన ప్రమాణ స్వీకారానికి టిడిపి అధ్యక్షులు, కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఇప్పటి వరకు ఆహ్వానం పలకని విషయం తెలిసిందే. అయితే తన ప్రమాణ స్వీకారానికి చంద్రబాబును ఆహ్వానించాలని కెసిఆర్ భావిస్తున్నారట. చంద్రబాబు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానాలు పంపిస్తున్నారట. వీరితోపాటు మిగిలిన పార్టీల అధ్యక్షులు, తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను అందరినీ ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు సన్నాహాలు చేస్తున్నారు.

పార్టీని బలోపేతం చేయండి: జగన్ తెలంగాణలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ పార్టీ తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలకు సూచించారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని ఆయన కోరారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి శనివారం ఉదయం హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు, ఎంపీలతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఎంపీల భేటీలో పార్లమెంటరీ నేతను ఎన్నుకోనున్నారు.

Leave a Comment