జెనీలియా తల్లి కాబోతోంది!!

12ముంబై : హ.. హ.. హాసిని అంటూ బొమ్మరిల్లుతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకుని, బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ముఖ్తో మెడలో మూడు ముళ్లు వేయించుకున్న జెనీలియా తల్లి కాబోతోంది. ఈ విషయాన్ని ఆమె భర్త రితేష్ నిర్ధారించాడు. బాంబే టైమ్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం తెలిపాడు. తన భార్య గర్భవతి అంటూ ఇన్నాళ్లుగా వస్తున్న కథనాలన్నీ ఇప్పుడు నిజమయ్యాయని అన్నాడు. ఆమె గర్భం దాల్చిందని, పిల్లల విషయంలో తామిద్దరం చాలా ఉద్విగ్నంగా ఎదురు చూస్తున్నామని చెప్పాడు.

ఇటీవల కొన్ని ఫొటోలలో జెనీలియా పొట్ట ఎత్తుగా కనపడటంతో ఆమె గర్భవతి అయి ఉంటుందని పత్రికల్లో గుప్పుమంది. ఇక త్వరలోనే తండ్రి కాబోతున్న ఆనందంలో ఉన్న రితేష్ దేశ్ముఖ్.. సాజిద్ ఖాన్, సైఫ్ అలీఖాన్లతో కలిసి చేసిన  ‘హమ్షకల్స్’ చిత్రం ప్రమోషన్లో మునిగి తేలుతున్నాడు.

Leave a Comment