టీవీ-9, ఆంధ్రజ్యోతిపై నిర్ణయం స్పీకర్, చైర్మన్లదే

tv-9- Andhra Jyothiహైదరాబాద్ : శాసనసభ గౌరవాన్ని కించపరిచే విధంగా ప్రసారాలు చేసిన  టీవీ-9, ఆంధ్రజ్యోతిపై ఎలాంటి చర్య తీసుకోవాలన్న నిర్ణయాన్ని తెలంగాణ సభ్యులు.. అసెంబ్లీ స్పీకర్, మండలి ఛైర్మన్లకు అప్పగించారు. ఈ మేరకు సభ్యులు శనివారం ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అందుబాటులో ఉన్న చట్టాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సభ్యులు ఈ సందర్భంగా స్పీకర్, మండలి ఛైర్మన్లకు విజ్ఞప్తి చేశారు.

కాగా టీవీ-9 చానల్, ఆంధ్రజ్యోతి పత్రికపై   కేసీఆర్ నిన్న శాసనసభలో నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. శాసనసభ గౌరవాన్ని కించపరిచే విధంగా ప్రసారాలు చేసిన టీవీ-9ను వదిలిపెట్టబోమని ఆయన హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని నెగటివ్‌గా చూయించే ప్రయత్నం ఆంధ్రజ్యోతి చేస్తోందని… పని గట్టుకుని విషం చిమ్ముతోందని మండిపడ్డారు. టీవీ-9, ఆంధ్రజ్యోతిపై చర్యలు తప్పవని కేసీఆర్ హెచ్చరికలు చేశారు.

Leave a Comment