డాలర్ కేసులో శేషాద్రికి ఊరట

తప్పు చేయని వారి పక్షనే న్యాయం… ధర్మం అనేవి నిలుస్తాయని… డాలర్ శేషాద్రి అన్నారు. శ్రీవారి డాలర్ల మాయం కేసులో తానూ నిర్దోషిగా బయట పడటం ఆనందంగా ఉన్నదని అన్నారు. ఆ ఏడుకొండలవాడి దయవాలనే తాను క్షేమంగా బయట పడినట్టు డాలర్ శేషాద్రి స్పష్టం చేశారు. టిటిడి ఉద్యోగులు కొందరు అవినీతికి పాల్పడుతున్నారని.. వారికి ఆ భగవంతుడు మంచి బుద్ధులు ప్రసాదించాలని కోరుకుంటున్నానని డాలర్ శేషాద్రి అన్నారు. తాను తప్పు చేసినట్టు ఎవరూ నమ్మలేదని… చివరకు అదే నిజమయిందని అన్నారు. 2006వ సంవత్సరంలో 5 గ్రాముల బరువుండే 300 బంగారు డాలర్లు మాయం అయ్యాయి. దీనిపై అప్పట్లో సిబిసిఐడి విచారణ జరిపి… 2008లో కోర్టుకు ఒక నివేదికను సమర్పించిన విషయం తెలిసిందే.

Leave a Comment