ఢిల్లీ రేప్ షాక్: 3రేప్‌లు చేసిన డ్రైవర్

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన యువతి పైన అత్యాచారం చేసిన ఉబెర్ క్యాబ్ డ్రైవర్ శివకుమార్ యాదవ్‌కు సంబంధించిన ఘోరాలు వెలుగులోకి వస్తున్నాయి. Rapist driver produced in court2011లోనే అతను జైలులో గడిపి వచ్చినట్లుగా సోమవారం వెలుగులోకి రాగా.. తాజాగా మరిన్ని బయటకు వస్తున్నాయి. సమాచారం మేరకు.. ఆ డ్రైవర్ 2013లో కూడా అరెస్టయ్యాడు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మొయిన్ పురిలో అతని పైన అత్యాచారం కేసు నమోదయింది. ఈ కేసులో అతను జైలుకు వెళ్లాడు. అనంతరం బెయిల్ పైన బయటకు వచ్చాడు. అంతేకాదు, అతను 2006 కూడా ఆయుధాలు కలిగి ఉన్న కేసులో అరెస్టయ్యాడు. కాగా, శివకుమార్ యాదవ్ 2011లో బార్ డ్యాన్సర్ పైన అత్యాచారానికి పాల్పడ్డాడని తెలుస్తోంది. అప్పుడు అతను ఏడు నెలల పాటు జైలులో ఉన్నాడు. అనంతరం ఈ కేసులో అతను బయటకు వచ్చాడు. బాధిత మహిళ, నిందితుడి మధ్య రాజీ కుదరడంతో అతను బయటకు వచ్చాడు. 2011లో దక్షిణ ఢిల్లీలోని మెహ్రౌలీ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది.

నాలుగు రోజుల క్రితం అతను మరో అత్యాచారానికి పాల్పడ్డ విషయం తెలిసిందే. నిందితుడు శివకుమార్ యాదవ్ మూడు అత్యాచారాలకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. డిసెంబర్ 6వ తేదీన మహిళా ఎగ్జిక్యూటివ్ పైన రేప్‌కు పాల్పడ్డాడు. ఇది మూడో అత్యాచారం.

 

Leave a Comment