తమ్మారెడ్డి దుమారం రేపాడు

మేము సైతం అంటూ యావత్ తెలుగు చలన చిత్ర పరిశ్రమ ముందుకు వచ్చి హుదుద్ తుఫాన్ బాధితుల సహాయార్ధం చేపట్టిన కార్యక్రమంలో మేమంతా ఒక్కటే మా మద్య విభేదాలు లేవని ప్రకటించి నిండా మూడు రోజులు కాకుండానే తమ్మారెడ్డి విరుచుకు పడ్డారు. తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న లుకలుకలను మరోసారి బయట పెట్టాడు తమ్మారెడ్డి. అందరూ కలిసి చేయాల్సిన ఈ కార్యక్రమానికి కొంతమంది డుమ్మా కొట్టగా మిగతా కొంతమందిబ్రతిమిలాడిపించుకున్నారని ,ఫిలిం ఫేర్ అవార్డు ల కోసం ఎక్కడెక్కడికో వెళతారు కానీ ఇక్కడ జరిగే నంది కార్యక్రమంలో పాల్గొనరు. ఇంతమంది మేముసైతం అంటే వచ్చింది కేవలం 8కోట్లేనని కానీ ఒకసారి బాలు ఒక్కడే కార్యక్రమం చేస్తే కోటి రూపాయలు వచ్చిందని ఘాటు విమర్శలకు దిగాడు. పనిలో పనిగా హీరోయిన్ లకు కూడా చురకలు అంటించాడు

Leave a Comment