తీహార్ జైలుకు 31లక్షలు చెల్లించిన సహారా

తీహార్ జైలు అధికార వర్గాలకు సహారా గ్రూప్ 31 లక్షల రూపాయలను చెల్లించింది. మదుపుదారుల సొమ్ము చెల్లించని కారణంగా సహారా గ్రూప్ అధినేత సుబ్రతా రాయ్ తీహార్ జైలులో ఉంటున్న విషయం తెలిసిందే. తన బెయిల్ కోసం 10,000 కోట్ల నిధులను సమీకరించడంలో భాగంగా విదేశాల్లోని లగ్జరీ హోటళ్ల విక్రయానికి వివిధ వర్గాలతో సుబ్రతా రాయ్ ఈ జైలు నుంచే చర్చలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా వినియోగిస్తున్న వీడియో కాన్ఫరెన్స్, ఇంటర్నెట్, ఫోన్, ఎయిర్ కండీషనర్ తదితర సదుపాయల ఖర్చులకుగాను ఈ 31 లక్షలను తీహార్ జైలుకు సహారా చెల్లించింది. హోటళ్ల విక్రయానికి సంబంధించి చర్చలకు జైలులోని కాన్ఫరెన్స్ గదిని వినియోగించుకునే వెసులుబాటును సుప్రీం కోర్టు సుబ్రతా రాయ్‌కి కల్పించింది.

Leave a Comment