తెలంగాణ రాష్ట్రంలో బిసిల జాబితా నుండి 26 కు లాలను తొలగించినట్లు బిసి సంక్షేమశాఖ మంత్రి జోగు రామన్న వెల్లడించారు. తెలంగాణ శాసనసభలో శనివారం ప్రశ్నోత్తరాల సమయంలో వెనుకబడిన తర గతుల జాబితా నుంచి కులాల తొలగింపుపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్న లకు మంత్రి సమాధానమిస్తూ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో బిసి జాబి తాలో 138 కులాలు ఉన్నాయన్నారు.
అయితే అనంతరామ్ కమిటీ సిఫారసుల మేరకు రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో లేని 26 కులా లను బిసి జాబితా నుండి తొలగించినట్లు ఆయన తెలిపారు. తొలగించిన 26 కులాలు తెలంగాణ రాష్ట్రంలో లేవని, వీరంతా కోస్తా, రాయలసీమకు చెందిన వారేనని ఆయన వివరించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అమలు చేసే విష యంలో బిసి జాబితా నుండి ఈ కులాలను తొలగించాల్సి వచ్చిందన్నారు. ఇప్ప టికే ముదిరాజ్‌లను బిసి జాబితాలో చేర్చాలనే డిమాండ్ ఉందని వెల్లడించారు. కొన్ని కుల సంఘాల విజ్ఞప్తి మేరకు తొలగించిన కులాలను బిసి జాబితాలో తిరి గి చేర్చే విషయమై ప్రభుత్వ పరిశీలనలో ఉందని మంత్రి చెప్పారు. ఈ అంశం పై రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌లో 15 లక్షల మంది సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారు ఉన్నారని వీరికి వ్యతిరేకంగా బిసి జాబితా నుండి కొ న్ని కులాలను తొలగించడం సమంజసం కాదన్నారు. జిఒ నెంబర్ 3కు సవరణ చేయాలని డిమాండ్ చేశారు.
బి లక్ష్మణ్ మాట్లాడుతూ బిసి జాబితా నుండి ఏవై నా కులాలను తొలగించాలంటే అందుకు బిసి కమిషన్ సిఫార్సుల మేరకు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ కమిషన్ సిఫారసుల మేరకే బిసి జాబితా నుండి తొలగింపులు, చేర్పులు జరగాల్సిఉం దని, అవేమీలేకుండా ఎలా తొలగించా రని ప్రభుత్వాన్ని నిలదీశారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకూ బిసి కమిషన్ ను ఏర్పాటు చేయలేదన్నారు. ఒక ప్రాం తానికి చెందిన వాళ్లనే నెపంతో బిసి జాబి తా నుండి కొన్ని కులాలను తొలగించ డం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేశా రు. టి రాజాసింగ్ మాట్లాడుతూ బిసి కు లాల నుండి పలు కులాలను తొలగించ డంపై ఆందోళన వ్యక్తమవుతోందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని తొలగించిన కులాలను తిరిగి బిసి జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు.
Recent Comments