తెలంగాన ఎన్ని”కలకలం…

ఎన్నికల కధలో ఓటర్ పాత్ర ముగిసిపోవటంతో మరి 2 రోజుల్లో వెలువడబోయే అంతిమ ఫలితాలపై తెలంగాన రాష్ట్రంలోనే కాక తెలుగు ప్రజలలో సైతం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది!

తెలుగువారిలో విభజన అనుకూల – ప్రతికూల వర్గాల మనోభావాలని పరిగణనలోకి తీసుకుంటే,..

దశాబ్దాల తెలంగాన కల సాకారమయ్యి హైదరాబాద్ మీద, హైదరాబాద్ ఆదాయం మీద, ఎన్నో వేల కోట్ల ఉమ్మడి ఆస్తుల మీద, బేషరతుగా హక్కులు సాధించుకుని కూడా ఇంకా బంగారు తెలంగాన ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎవరితో వస్తుందా అనే మీమాంసతో మిగిలిన తెలంగాన వాసులకు తమ ఆలోచనలు ఇప్పటికీ ఎలా ఉన్నాయో చూపించే అద్దం ఈ ఎన్నికలు!

ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టి కోణంలో,..
తమ ఆర్ధిక జీవితాలు, పిల్లల భవిష్యత్తుని నేరుగా దెబ్బతీసే విభజన పరిణామం మీద తమ తిరస్కారం, ఆగ్రహం ఎవరికి చెప్పుకోవాలో,. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న ఈ భారతదేశంలో పౌరులుగా తమ విలువ ఎందుకు ఉండదో అర్ధం కాని అయోమయ స్థితిలో జరిగిపోయిన రాజధాని విభజన పరిణామం తర్వాత వస్తున్న ఈ ఎన్నికలలో, సహజంగానే హైదరాబాద్ కోసం ఉద్యమం అంటూ ప్రాంతాల పేరుతో తమని నీచంగా అవమానించే నాయకులు ఓడిపోతే చూడాలనుకుంటున్నారు.

ఈ ఎన్నికలలో తెలంగాన సామాన్య ప్రజల ఆలోచనలకి సంభందించిన స్పష్టమైన రాజకీయకోణాలు బయటపడబోతున్నాయనేది పరిశీలకుల అంచనా…

మొదటి తెలంగాన ఎన్నికలలో మొత్తం 119 శాసనసభ స్థానాలు ఏర్పడగా, అధికార పీఠాన్ని అధిరోహించటానికి అవసరమైన స్థానాలు 60. ఐతే, బలిదానాల, ఆత్మగౌరవ పోరాటాల తెలంగాన సాధించిన పార్టీగా, ఒక దళితుడిని మాత్రమే ముఖ్యమంత్రిని చేస్తాం అనే వాగ్దానంతో తెరాస తన చారిత్రాత్మక గెలుపు కోసం ప్రజల్లోకి వెళితే కారు ఎక్కటానికి వచ్చిన స్థానాలు కేవలం “63” !?
అంటే కావలసిన శాసనసభ్యుల కంటే ముగ్గురు మాత్రమే ఎక్కువ ఉన్నారన్న మాట!
నిజానికి, 5/10 మంది అసంతృప్తులని ప్రభావితం చేసి 2014 తెరాస ప్రభుత్వాన్ని కూల్చటం కాంగ్రెస్ తెలుగుదేశం వంటి బలమైన పార్టీలకు అప్పటి పరిస్థితులలో పిల్లాట లాంటిది, అలా జరగటం దేశంలో ఎన్నో సార్లు చూస్తునాము కూడా! కానీ, తెరాస
అప్పుడు. కేవలం , 5 శాసనసభ్యులు అసంతృప్తితో ఒక గదిలో సమావేశమయితే ప్రభుత్వం కూలిపోయేది అని అర్ధం! ఈ కూడికలు తీసివేతలు తెరాసకి నిద్రాణి దూరం చెయ్యటంతో, పరాయి పార్టీ శాసనసభ్యులతో సహజీవనం చెయ్యటానికి పదేపదే ప్రేమలేఖలు పంపి పార్టీలోకి రప్పించుకున్నారు అనేది బహిరంగ రహస్యం.

అంగబలం కొరత
కాగా, తెరాసకి 63 కుర్చీలు మాత్రమే దక్కటానికి అప్పటి కారణం ఆ పార్టీకి రాజకీయ యంత్రాంగం లేకపోవటమే అని చెప్పాలి!
కారణం: 2001 లో ఆలె నరేంద్ర స్థాపించిన “తెలంగాన సాధన సమితి” అనే బృందం నిర్దిష్ట కార్యాచరణ కలిగిన వ్యవస్థతో ఏర్పడింది కాదు. కెసిఆర్ సమైక్యంగా ఉందాము రమ్మని కోరినాక నరేంద్ర తన పార్టీని కెసిఆర్ ప్రకటించిన “తెలంగాన రాష్ట్ర సమితి” గా పేరు పంచుకున్నాడు! అనంతరం అవినీతి ఆరోపణలకి బాధ్యత వహించి రాజీనామా చెయ్యాలని కోరిన కెసిఆర్ ఆలె నరేంద్ర ని తెరాస కార్యాలయం బయటకు పంపారు!
అలా ఒక వర్గంగా మారిన,..కెసిఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత తదితరుల ప్రధాన కార్యాచరణ: వీలయినంత ఎక్కువమంది ఉండే ప్రదేశాలకి వెళ్లి ప్రసంగించటము లేదా కొన్ని పరిమిత స్థానాలలో స్థానికులం అని చెప్పుకుంటూ గెలస్తూ, రాజీనామా చేస్తూ మళ్లీ మళ్లీ ఎన్నికలకు వెళ్ళటమే అవ్వటంతో,.2014 ఎన్నికలలో సమన్వయానికి, నిర్వహణకు, స్థానిక మోహరింపులకు అవసరమైన మానవ వనరులు అందుబాటులో లేకపోవటమే అనేది ఒక విశ్లేషణ.
ప్రతిపక్ష పార్టీ శాసన సభ్యులు, కీలక సభ్యులు, నాయకులు, కార్యకర్తలు అనే తేడా లేకుండా అందరినీ నయానో భయానో తమతో కలిపేసుకుని ఉండటంతో పాటూ,..అధికారం తోడుగా వచ్చే అన్ని వనరులను సద్వినియోగం చేసుకుని మానవ వనరులని ప్రాంతాల వారీగా ఏర్పరుచుకుని ఉంటుంది కాబట్టి తెరాస తన కేడర్ విషయంలో ఈసారి తెలంగానలో అందరికంటే బలమైన పార్టీ ఔతుంది.

నాయకత్వ లోటు

* దళితులకు 3 ఎకరాల భూమి!
* దళితుడే ముఖ్యమంత్రి!
* (జిల్లాకు) లక్ష ఉద్యోగాలు!
* ఇంటింటికి నల్లా నీళ్లియ్యకపోతే ఓట్ అడగటానికి రాము!
* ఎన్‌టి‌ఆర్ మైదానంలో కళా భవనం కడతాము!
* అసెంబ్లీ, సెక్రెటేరియెట్ కడతాము!
* కేంద్రం నుండీ ITIR సాధిస్తాము!
* కాళేశ్వరం ఎత్తిపోతల పధకం
* కోటి ఎకరాలకి నీళ్ళిస్తాము!
* ఆపరేషన్ భగీరధ, మిషన్ కాకతీయ గురించి ఎన్నికల ప్రసంగాలలో ప్రస్తావించే ధైర్యం లేకపోవటం!
* హుస్సేన్ సాగర్ లో త్రాగునీరు, చుట్టూ ఆకాశ హర్మ్యాలు!
* హైదరాబాద్ లో స్కై వే బొమ్మలు! ఆంధ్రులు పిల్లర్స్ వేసి వెళ్ళిన మెట్రో రైల్ ప్రాజెక్ట్ పూర్తి కాలేదు!
* ఆంధ్రులు ఇచ్చిన ₹4200 కోట్ల GHMC నిధులు హరీ!
* 24 గంటలు కరెంట్ ఇస్తున్నారుట, ఇస్తున్న ఆంధ్రులకి ₹ 5 వేల కోట్లు దాటిన ఆ కరెంట్ బిల్స్ కట్టటం లేదు.
ఈ చిట్టా సాగిపోతూనే ఉంటుంది!

ఏది ఏమైనా తమ మనసులోని తిట్లని వేదికలెక్కి బహిరంగంగా తిట్టగలిగినవారే మనకి నాయకులుగా ఉండాలి అనుకోవటం, వాళ్ళు మాత్రమే మన మంచి కోసం పని చేస్తారు అనే సామూహిక దృక్పధం, లేదా ఇంతకంటే మెరుగైన నాయకుడు తమకు లేడు అనే తీర్మానానికి కట్టుబడి మళ్ళీ అదే పార్టీని కోరుకోవచ్చు!

Leave a Comment