తెలుగునాడు అని లగడపాటి డిమాండ్

lagadapati1399474619కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలుగునాడుగా పేరు మార్చాలని లగడపాటి రాజగోపాల్ అన్నారు. దీని కోసం అసెంబ్లీలో కొత్త ప్రభుత్వం తీర్మానం చేయాలన్నారు. కొత్తగా ఏర్పడనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.10 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉంటున్న నేపథ్యంలో కొత్త ప్రభుత్వం కేంద్రం నుంచి నిధులు రాబట్టి రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలన్నారు. హైదరాబాదులో ఉన్న రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంలో పని చేయాలని, ఈ ఎన్నికల్లో గెలుపొందిన పార్టీ కొత్త రాష్ట్రంలోనే ప్రమాణస్వీకారం చేయాలన్నారు.

Leave a Comment