తొలిసారి సచిన్ భలే ముద్దుగా ఉన్నాడు….

సచిన్ టెండుల్కర్ ఆత్మకథ ‘ఫ్లేయింగ్ ఇట్ మై వే’ ఆవిషర్కరణ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి క్రికెట్ దిగ్గజాలు ద్రవిడ్,గంగూలీ,లక్ష్మణ్,సునీల్ గవాస్కర్,దిలీప్ వెంగ్ సర్కార్,రవిశాస్త్రి,సచిన్ గురువు రమాకాంత్ అచ్రేకర్,హర్షా భోగ్లే లు హాజరయ్యారు. ఆవిషర్కరణ సందర్భంగా సచిన్ తొలి బంతి ఎదుర్కొన్నప్పటి నుంచి 24ఏళ్ల పాటు జరిగిన సంఘటనలు, తన వ్యక్తిగత జీవితంలో భయటిప్రపంచానికి తెలియని  ప్రేమకథ, ఎక్కడ మొదలైంది..?  అటువంటి ఆసక్తికర విషయాలన్నీ వెలుగులోకి వచ్చాయి. అయితనే సచిన్ తో తన ప్రేమాయణాన్ని అంజలి వివరించింది.

ఆమె మాటల్లో….

నేను ఇంగ్లాండ్ లో ఉండగా మ్యాచ్ లకోసం అక్కడికి వచ్చాడు. అతను సెంచరీ చేసి వార్తల్లో నిలిచాడు. మా అంకుల్ తనను కలవమని చెప్పినా వెళ్ల లేదు. ఐతే అతణ్ని తొలిసారి చూసినప్పుడు భలే ముద్దుగా ఉన్నాడనిపించింది. తర్వాత అతడి వెంటపడ్డా. ఓసారి ఎయిర్ పోర్టులో  అమ్మ కోసం ఎదురు చూస్తుండగా సచిన్ వచ్చాడు. నేను మా అమ్మ సంగతి మరిచి పోయి అతడి కోసం పరుగెడుతూ..సచిన్, సచిన్ అని అరిచాను. అప్పుడు తనతో పాటు అజిత్, నితిన్ ఉండటంతో సిగ్గుపడుతూ తల వంచుకుని వెళ్లిపోయాడు. తర్వాత సచిన్ స్నేహితుడి దగ్గర ఫోన్ నెంబర్ తీసుకుని పోన్ చేశా. తనే ఫోన్ తీసి మాట్లాడాడు. నేను అంజలినని చెప్పి..ఎయిర్ పోర్టు సంఘటన గురించి చెప్పా. తను గుర్తుపట్టాడు. ఆ సమయంలో నేను నారింజ రంగు టీషర్ట్ వేసుకున్న విషయం కూడా చెప్పాడు. 17ఏళ్ల వయసులో సచిన్ ను తొలిసారి చూశా. 15ఏళ్లకే అతణ్ని చూసి ఉంటే ..అప్పుడే అతని వెంట పడేదాన్నేమో అని అంజలి తెలిపింది.

‘సచిన్ ను 1990లో తొలిసారి కలిశాను. ఆ సమయంలో మొబైల్స్, ఎస్ఎంఎస్, ఇంటర్నెట్ లు లేవు,  వైద్య కళాశాలలో చదువుకునే నేను రాత్రి పదిగంటల తర్వాత పీసీవో బూత్ లకు వెళ్లి సచిన్ కు కాల్ చేయాల్సి వచ్చేది. ఆసమయంలో అయితేనే ఐఎస్ డీ ధరలు తక్కువుండేవి. ఫోన్ చేసినా..క్షణ క్షణం డబ్బులు కరిగిపోవడం చూస్తూ ఫోన్ మాట్లాడేదాన్ని. ఈ ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని సచిన్ కు ఎక్కువగా ఉత్తరాలు రాసేదాన్ని. సచిన్ విదేశీ పర్యటనకు వెళ్లడానికి  ముందే లేఖరాస్తే..అతనక్కడికి వెళ్లాక అందేది’’

‘‘ సచిన్ కు 21ఏళ్లు నిండగానే పెళ్లి చేసుకోవడానికి ఏ అభ్యంతరం లేదని చెప్పాడు. అతను న్యూజిలాండ్ పర్యనటలో ఉండగా నాకు ఫోన్ చేసి..మా పెళ్లి విషయంలో తన ఇంట్లో నేనే మాట్లాడాలని చెప్పాడు. నేనే వెళ్లి వాళ్లింట్లో వాళ్లతో మాట్లాడానని అంజలి తన ప్రేమకథను చెప్పింది.

Leave a Comment