దుమారం రేగుతున్న వర్మ ‘సావిత్రి’…..

సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ సినిమా మరోసారి వివాదస్పదంగా మారింది. ఆయన తాజా చిత్రం ‘సావిత్రి’పై వివాదం రేగుతోంది. సావిత్రి పేరుతో ఓ టీచర్ అందాలను ఓ కుర్రాడు తొంగి తొంగి చూస్తూ ఉన్న స్టిల్స్ వివాదానికి కారణం అయ్యాయి. దర్శకుడు రాంగోపాల్ వర్మపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై స్పందించిన దర్శకుడు

నేను స్కూల్లో చదువుకునేటప్పుడు మా ఇంగ్లీష్ టీచర్ సరస్వతి అంటే నాకు పిచ్చెక్కిపోయేది .ఆ సరస్వతే నాకు “సావిత్రి”…

అలాగే మీ, మీ జీవితాల్లో మీ టీచర్లో, మీ పక్కింటి లేదా ఎదురింటి ఆంటీలో , మీ అక్క ఫ్రెండ్స్సో, మీ ట్యూషన్ టీచర్లో,ఇలా రక రకాల సావిత్రిలు ఉండే ఉంటారు.

అలా మీ అందరి జీవితాల్లో తారస పడిన ఆ సావిత్రిలందరి ఇన్స్పిరేషన్ తోనే ఈ “సావిత్రి” సినిమా మొదలు పెడుతున్నాం.

ఈ సందర్బంగా “మీ సావిత్రి ఎవరు”అనే కాంటెస్ట్ పెట్టబోతున్నాం .ఈ కాంటెస్ట్ లో మీ జీవితంలో మీకు ఎదురైన మీ సావిత్రి కి సంబందిచిన మీ మీ అనుభవాలు కూడా మాతో naasaavitri.com లో పంచుకుంటే మీ ఆ అనుభవాలని కూడా మా “సావిత్రి” లో పెడతాం.

Leave a Comment