దుర్భర బాల్యము – ప్రియ నాయుడు /లండన్

రచన : ప్రియ నాయుడు /లండన్

దుర్భర దారిద్రము మిగిల్చిన బూడిద  బ్రతుకులు మీవి,,,

చిక్కని చీకటి దుప్పటి కప్పిన అంధకార  బతుకులు మీవి ,,

భయంకర శోధనల బాల్యము తరిమి తరిమి కొడుతుంటే

బక్కచిక్కిన భీబత్స బాల్యపు భయంకర  చితిమంటలు  మీవి,

 

దారిద్రము సాక్షిగా చితికిన బాల్యము మీది ,

అరణ్య రోదన మీది గాండ్రించి ఊసిన కామవాంచలు చిమ్మిన ఊపిరిలు మీవి

 ఆక్రందనలు మీవి  కొవ్వు పట్టి సందుల గొందుల పందుల వలే నేల దొర్లిన

 చీకటి కోర్కెల క్షణిక కామ వాంచలు,.కండకావరాల కార్చిన వ్యర్ధము లు మీరు

  బలి పశువులు మీరు

 సిగ్గు ఎగ్గు  లజ్జ కనికరం  లేని ఈ కుళ్ళి పోయిన వ్యవస్థలో

దిక్కులేని బతక  తెలియని బిచ్చగాళ్ళ దుర్బర గుర్తులు మీవి

 

ఎంత ఎక్కు పెట్టి ఎలుగెత్తి  గొంతెత్తి గగ్గోలు పెట్టినా

మీకు పట్టిన ఈ దీన మైన  జీవితాలకు విముక్తి లేదు 

భగ భగ మండే అగ్ని కణాల సాక్షిగా బుగ్గి పాలైన

మీ బాల్యానికి ..కరుడు కట్టిన జీవితాలకు విముక్తి లేదు

మీరే పడే పసితనపు   బాధలకు వర్ణన కుదిరే అక్షరాలు లేవు

 

ఎన్నాళ్ళు భరిస్తారు ఆ మౌనఘోషను ,ఈ వల్లకాడు బ్రతుకులను

ఉపేక్షించకండి   శపించండి,,,ధూషించండి.గొంతెత్తి అరవండి…

 

ఎవరు ఎవరు ఇందుకు కారణాలు,,ఎందుకు మాకు ఈ రోదనలు

కనికరము లేని ఈ ప్రపంచన ఎందుకు మాకు ఈ శోకాలు

మాకు ఎందుకు ఈ ఆకలి సంకెళ్ళు ఈ బ్రతుకుల తిప్పలు

అని నిగ్గదీసి అరవండి ..సమాజపు కళ్ళు తెరిపించండి

 

ఎందరో  వొస్తారు ఎదో చేస్తామంటారు ..వోదార్చి పోతారు

మా దైన్యాన్ని చూసి దేవునికే ,,గుండె జారి పోతోంది,,,

లేవుగా అందరి బాలల మాదిరి మాకు ఆనందాలు,,,

బ్రతుకు విలువ పోగొట్టుకొన్న పూజకు నోచని పువ్వులు

 

మా దీన గాధలు దొరుకుతాయి ప్రతి సందుల ..గొందులలో

మాకు ప్రసాదించిన ఇలాంటి జీవితాలకు సిగ్గుతో తలవంచండి

మా ధైర్యానికి,,,ఈ సమాజమే ,తలదించాలి మాకు సలాము కొట్టాలి,,,

మాకు లేవు బాలల దినోత్సవాలు ,,పండగలు పబ్బాలు,,,

మురిగిపోయిన పాడు జీవితాలు,స్వార్ధానికి మిగిలిన వ్యర్ధగుర్తులు

 

మాకొద్దు ఈ బాల్యము ..మా ఈ జీవితాలకు కాదు మేము కారణం

 

దుర్భర బాల్యం // రచన : ప్రియనాయుడు /లండన్ /

Leave a Comment