నకిలీ ఏటీఎం కార్డులతో కోటిన్నర చోరి!

51389555643_625x300అనంతపురం: గుంతకల్లులో హైటెక్ చోరీ ముఠా సభ్యుల అరెస్ట్ స్థానికంగా కలకలం రేపింది. నకిలీ ఏటీఎం కార్డులతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నకిలీ కార్డులతో చోరీలకు పాల్పడుతున్న ముఠాలో హైదరాబాద్ కు చెందిన కార్తీక్ కీలక సభ్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కార్తీక్ నుంచి  31 నకిలీ ఏటీఎం కార్డులు, 8వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ముఠాలోని మరో ముగ్గురు సభ్యులు పరారీలో ఉన్నారు.
నకిలీ ఏటీఎం కార్డుల ద్వారా సుమారు కోటిన్నర రూపాయలు దొంగిలించినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడు కార్తీక్ ను పోలీసులు విచారిస్తున్నారు. నకిలీ ఏటీఎం కార్డులతో చోరీలకు పాల్పడుతున్న కార్తీక్ పై కేసు నమోదు చేసి.. మిగితా సభ్యుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Leave a Comment