నక్సలిజాన్ని ఉపేక్షించం

1హోంమంత్రి రాజ్‌నాథ్ వెల్లడి
     
{పజల ఆశలను మోడీ ప్రభుత్వం నెరవేర్చుతుంది
యూపీఏ హయాంలో ప్రభుత్వ వ్యవస్థ స్తంభించిపోయింది
సరిదిద్దేందుకు సమయం పడుతుంది

 
లక్నో: నక్సలిజం, వేర్పాటువాదం, ఉగ్రవాదం వంటి సమస్యలను పరిష్కరించేందుకు ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అవసరమని, ఇందుకోసం తమ మంత్రిత్వశాఖ కసరత్తు చేస్తోందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రిగా ప్రమాణం చేసిన అనంతరం రాజ్‌నాథ్ తొలిసారిగా తన నియోజకవర్గమైన లక్నోలో శనివారం పర్యటించారు. ఆయనకు స్థానిక చౌధురి చరణ్‌సింగ్ విమానాశ్రయంలో పార్టీశ్రేణులనుంచి ఘనస్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. దేశం ముందున్న అనేక భారీ సమస్యలను పరిష్కరించేందుకు గతంలో ఎటువంటి ప్రయత్నం జరగలేదని, ఇందుకోసం ఎలాంటి కార్యాచరణ ప్రణాళిక చేపట్టలేదని తప్పుపట్టారు. ఈ నేపథ్యంలో ఇందుకోసం తాము కసరత్తు చేపట్టామని, ఇందులో విజయం సాధించగలమని గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారానికి సార్క్ దేశాల అధినేతలను ఆహ్వానించడం స్వాతంత్య్రానంతరం ఇదే ప్రథమమన్నారు. తద్వారా ఆయా దేశాలతో సుహృద్భావ సంబంధాలను కోరుకుంటున్నామన్న విషయమై ఒక స్పష్టమైన సందేశాన్ని పంపామని ఆయన చెప్పారు. యూపీలో శాంతిభద్రతల పరిస్థితిపై రాజ్‌నాథ్‌ను ప్రశ్నించగా.. ప్రస్తుతం తాను ఏ రాష్ట్రం గురించి కూడా వ్యాఖ్యానించబోనని బదులిచ్చారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
1.   {పజలు బీజేపీకి తిరుగులేని విజయం అందించారు. అదేసమయంలో ఈ ప్రభుత్వంపై వారిలో ఎన్నో ఆశలున్నాయి. మోడీ డైనమిక్ నేత. ఆయన నేతృత్వంలోని సర్కారు రాబోయే ఐదేళ్లలో ప్రజల ఆశలను నిజం చేస్తుంది. ఇది తథ్యం.
2.    {పస్తుతం ఎదుర్కొంటున్న సమస్యల నుంచి దేశాన్ని బయటపడేసేందుకు కొత్తగా ఎన్నికైన ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది. అయితే గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. దీనిని ఒకటి, రెండు సంవత్సరాల్లోనే మార్చడం సాధ్యం కాదు. దీనిని సరిదిద్దేందుకు మరింత సమయం అవసరం.  
3.    గోపీనాథ్ ముండే హఠాన్మరణం మమ్మల్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన ప్రజాదరణ కలిగిన నేత. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ముండేను సీఎం అభ్యర్థిగా నిలపాలని భావించాం.
4.    నన్ను భారీ మెజారిటీతో గెలిపించిన లక్నో ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు సర్వదా కృతజ్ఞుడిని
 

Leave a Comment