నది ఒడ్డునే సచివాలయం?

ఆంధ్రప్ర దేశ్‌ నూతన రాజధాని ఎక్కడన్నది తేలి పోతుండటంతో ప్రభుత్వంలో ప్రధానమైన శాసనసభ, సచివాలయం, ముఖ్య మంత్రి అధికార నివాసం, రాజ్‌భవన్‌ తదితరాలు ఎక్కడ ఉండవచ్చనే విష యమై పలు ప్రతిపాదనలను ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు పరిశీల నలో ఉన్నట్లు సమాచారం. రాజధాని నిర్మాణం కోసం ఏపి ప్రభుత్వం భూ సమీకరణ చేయనున్న 18 గ్రామాల్లోని 30 వేల ఎకరాల్లోనే ప్రధానమైన కార్యా లయాలు ఏర్పాటవుతాయని తెలిసింది. ఇందులో కూడా కృష్ణానదికి సమీపంలో ఉన్న మందడం, తాళ్లాయపాలెం, ఉద్దండరాయని పాలెం, లింగాయపా లెం, వెంకటాయపాలెం, రాయపూడి, బోరు పాలెం గ్రామాల్లో ప్రధానంగా శాసన సభ, సచివాలయంతో పాటు ముఖ్య మంత్రి కార్యాలయం, అంతరా ్జతీయ కన్వెన్షన్‌ కేంద్రం, అంతర్జాతీయ స్ధాయిలో ఒక హోటల్‌ తదితరాలను నిర్మించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. విదేశీ అతిధులు, పారిశ్రామిక వేత్తలతో సమావేశాలు తదితర ముఖ్య సమావేశాల్లో పాల్గొనా లంటే నదికి ఆనుకుని ఉంటేనే బాగుం టుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు గట్టిగా అనుకున్నారు. అదేవిధంగా, రాజ్‌భవన్‌, డిజిపి కార్యాలయం, హైకోర్టు తదితరాలను కూడా నదీ తీరానికి అనుకునే నిర్మిం చాలని అలోచిస్తున్నది ప్రభుత్వం. సచివాలయంలోనే ఎటుతిరిగీ వివిధ విభాగాల ఉన్నతాధికారులున్నప్పటికీ వారి శాఖాధిపతుల కార్యాలయాలు, అధికారుల, సిబ్బంది నివాస సముదా యాలు తదితరాలు ఇబ్రహింపట్నం దగ్గరలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిసింది. నిబంధనల ప్రకారం నదికి సుమారు 200 మీటర్ల దూరం విడిచిపెట్టాలి. ఈ 200 మీట ర్లలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టేందు కు లేదు. అక్కడి నుండి మరో 200 మీటర్లు గ్రీనరీ కోసం వదిలిపెట్టాలని ప్రభుత్వం అనుకుంటున్నది. ఆ త… ర్వాతనే ఎనిమిది లైన్ల రహదారులు, ఆ తర్వాత పార్కులు, వర్తక, వాణిజ్య సముదాయాలు, వినోద కేంద్రాలు ఏర్పాటు చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నది. ఉన్నతాధికారుల నివాసాలు, మంత్రుల క్వార్టర్లు, ముఖ్యమంత్రి, గవర్నర్‌ సిబ్బంది క్వార్టర్లను ఆకాశహర్మా్యలలో ఏర్పాటు చేయనున్నది. భవిష్యత్తులో తాడికొండలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వ ముంది. అయితే, ముందుగా శాసనసభ, సచివాలయం నిర్మాణం మొదలుపెట్టాలని ప్రభుత్వం అనుకున్నట్లు తెలిసింది.

Leave a Comment