నరసింహన్ కు అదనపు బాధ్యతలు

4హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా నియమితులయ్యారు. నరసింహన్ కు అదనపు బాధ్యతలు కేటాయిస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక మీద ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణకు కూడా నరసింహన్ గవర్నర్ గా వ్యవహరిస్తారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా వ్యవహరిస్తున్న నరసింహన్  జూన్ 2 తేది నుంచి అదనంగా తెలంగాణ బాధ్యతల్ని కూడా నిర్వహిస్తారని రాష్ట్రపతి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్ ను నియమించే వరకు నరసింహన్ బాధ్యతల్ని నిర్వహిస్తారని రాష్ట్రపతి కార్యాలయం వెల్లడించింది. 

Leave a Comment