నరేంద్ర మోడీ.. ప్రపంచ ఫ్యాషన్ హీరో

33వాషింగ్టన్: ఒకప్పుడు నరేంద్ర మోడీ అంటేనే అమెరికా మీడియా అంతెత్తున ఎగిరిపడేది. మోడీకి వీసా ఇవ్వడానికి కూడా అమెరికా ప్రభుత్వం అప్పట్లో నిరాకరించింది. ఇదంతా గతం. ఇప్పడు అమెరికా మీడియాకు భారత ప్రధాని మోడీ ఫ్యాషన్ హీరో. లోక్సభ ఎన్నికల్లో తన సారథ్యంలో బీజేపీకి ఘనవిజయం అందించి.. ప్రధానిగా మోడీ ప్రమాణం స్వీకారం చేశాక అమెరికా వైఖరిలో మార్పు వచ్చింది.

అమెరికాలో అత్యధిక సర్క్యులేషన్ గల టైమ్, న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ పత్రికలు మోడీ వేషధారణను ప్రశంసిస్తూ ప్రత్యేక కథనాలను ప్రచురించాయి. మోడీని ఫ్యాషన్ ఐకాన్గా అభివర్ణించాయి. ‘నాయకుడంటే ఇలాంటి దుస్తులే ధరించాలి’ అని  న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రచురించింది.  మోడీ ధరించే కుర్తా గురించి రాశారు. వస్త్రధారణపై ప్రత్యేక శ్రద్ధ చూపే అమెరికా ప్రథమ మహిళ మిచెల్లి ఒబామా, రష్యా ప్రధాని వ్లాదిమిర్ పుతిన్లతో పోలుస్తూ మోడీని ఆకాశానికి ఎత్తేశారు. ఇక వాషింగ్టన్ పోస్ట్ అయితే ప్రపంచానికి కొత్త ఫ్యాషన్ ఐకాన్ వచ్చారంటూ  మోడీని ప్రశంసించింది.  
 

Leave a Comment