నవంబర్ లో బాబు విదేశీ పర్యటన

ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత తెలంగాణ విభాజిత అవశేష రాష్ట్రానికి రాజధాని నగరం కూడా లేకుండా పోయిన సంగతి తెలిసిందే. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త రాజధాని నగరాన్ని గుంటూరు- విజయవాడ నగరాల మధ్య నిర్మిస్తామని ఇప్పటికే ప్రకటించారు. అయితే రాజధాని నిర్మాణం సింగపూర్ తరహా అతర్జాతీయ ప్రమాణాలతో అన్ని హంగులతో నిర్మించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ నేపధ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నవంబర్ నెలలో విదేశీ పర్యటన చేయనున్నారు. ఇక వచ్చే నెల నవంబర్ 12,13,14 తెదీల్లో సింగపూర్ లోను, 24,25,26 తేదీలలో జపాన్ లోను చంద్రబాబు పర్యటించనున్నారు. అలాగే ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని నమూనా పరిశీలనతో పాటు విదేశీ పెట్టుబడులను కూడా చంద్రబాబు ఆహ్వానించనున్నారు. కాగా ఇప్పటికే స్మార్ట్ కేపిటల్ సిటీ నిర్మాణంలో సాంకేతికంగా సహకరిస్తామని జపాన్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక చంద్రబాబుతో పాటు పలువురు పారిశ్రామిక వేత్తలు, ముఖ్యాధికారులు ఈ పర్యటనకు వెళ్లనున్నారు.

Leave a Comment