నవ్వులు పూయించిన అక్బరుద్దీన్

akbaruddinమజ్లిస్ పార్టీ శాసన సభా పక్ష నేత అక్బరుద్దీన్ సచివాలయంలో జరిగిన అఖిలపక్ష భేటీ అనంతరం నవ్వులుపూయించారు. విలేకరులతో ఆయా పార్టీల నేతలు మాట్లాడుతున్న సమయంలో.. అక్బరుద్దీన్ వంతు వచ్చింది. మైకు వద్దకు వచ్చిన ఆయన ఇంగ్లీషులో మాట్లాడాలా లేక ఉర్దూలో మాట్లాడాలా అన్నారు. ఓ విలేకరు మాట్లాడుతూ.. తెలుగులో మాట్లాడండి అన్నారు. దీనికి అక్బర్ స్పందిస్తూ.. వచ్చే సంవత్సరం తెలుగులో మాట్లాడతా అన్నారు. దీంతో అక్కడ నవ్వులు విరబూసాయి. తాను తెలుగు నేర్చుకుంటున్నానని, అందుకే వచ్చే సంవత్సరం మాట్లాడతానని చెప్పానని అక్బరుద్దీన్ అన్నారు.

Leave a Comment