నాన్ స్ట్రయికర్‌ను ఆపండి

81402082927_625x300బౌలర్ బంతి వేశాకే క్రీజు వదలాలి
 ఆటగాళ్ల దురుసు ప్రవర్తనపై కఠిన చర్యలు
 ఐసీసీ క్రికెట్ కమిటీ ప్రతిపాదనలు
 
 బెంగళూరు: సాధారణంగా బౌలర్ బంతిని వేసిన తర్వాతే నాన్ స్ట్రయికర్ క్రీజ్ వదిలి ముందుకెళ్లాలి, లేకపోతే అంపైర్లు బ్యాట్స్‌మన్‌ను అడ్డుకోవాలని ఐసీసీ క్రికెట్ కమిటీ ప్రతిపాదించింది. ‘నాన్ స్ట్రయికర్ ముందుగా క్రీజ్ వదిలితే అంపైర్లు ముందస్తు హెచ్చరిక చేయాలి. ఆ తర్వాత బౌలర్‌కు రనౌట్ చేసే అవకాశం ఇవ్వాలి.
 
 ఈ విధానానికి కెప్టెన్లు మద్దతిస్తే అంపైర్లు తుది నిర్ణయం తీసుకోవచ్చు’ అని ఐసీసీ పేర్కొంది. ప్రస్తుతం ఆట ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలపై భారత మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే నేతృత్వంలోని క్రికెట్ కమిటీ రెండు రోజుల పాటు చర్చలు జరిపి కొన్ని ప్రతిపాదనలు చేసింది. వికెట్ పడినప్పుడు నోబాల్స్‌ను చెక్ చేయడం బాగా విజయవంతమైందని, అలాగే డీఆర్‌ఎస్ వ్యవస్థ కూడా బాగా మెరుగైందని కమిటీ పేర్కొంది. మైదానంలో ఆటగాళ్ల దురుసు ప్రవర్తనపై అంపైర్లు కఠినంగా వ్యవహరించాలని, సందేహాస్పద యాక్షన్ ఉన్న బౌలర్ల శైలిని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని కమిటీ సూచించింది. రెండు రోజుల పాటు జరిగిన ఐసీసీ క్రికెట్ కమిటీ సమావేశంలో చేసిన ప్రతిపాదనలను… ఈ నెలాఖరున మెల్‌బోర్న్‌లోజరిగే ఐసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో చర్చిస్తారు.

Leave a Comment