నాపాలన వల్లే సత్యనాదెళ్ల సీఈవో అయ్యారు…..

ఎలక్ట్రానిక్ మీడియా ఎడిటర్లతో  ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా  రాష్ట్రంలో  ఐటీతోపాటు హార్డ్ వేర్ ను అభివృద్ధి చేస్తామని హామిఇచ్చారు. కొత్త రాజధాని దేశానికే బ్రాండ్‌ అవుతుందన్నారు. 1412080398chandhrababu naidu-satya nadellaసత్యనాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈవో కావడానికి తన పరిపాలనే తెలిపారు . వ్యవస్థలను దుర్వినియోగం చేస్తే..ఎవరికైనా జయలలితకు పట్టిన గతే పడుతుందని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌తో సమన్వయంతో పనిచేస్తాం..అలాగని అన్నింటిని సమర్ధించమని పునరుద్గాటించారు. తెలంగాణలో టీడీపీ బలంగా ఉంది కాబట్టే..కేసీఆర్ తనను టార్గెట్ చేశారని మండిపడ్డారు. కొన్ని పత్రికలపై పార్టీ పరంగానే నిషేధం..ప్రభుత్వపరంగా లేదని స్పష్టం చేశారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా..రుణమాఫీ అమలు చేస్తామని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సూచించారు.

Leave a Comment