నేటితో చంద్రబాబు పర్యటన పూర్తి!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరు రోజుల జపాన్ పర్యటనను ముగించుకుని నేడు భారత్ కు ప్రయాణం కానున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులను రాబట్టడమే ధ్యేయంగా జపాన్ పర్యటనను చేపట్టిన చంద్రబాబు తన లక్ష్యాన్ని సులువుగా పూర్తి చేసారనే చెప్పవచ్చును. ఇక జపాన్ పర్యటనలో ఆ దేశ ప్రధానితో పాటు పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమై ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి అవకాశాలు, రాజధాని నిర్మాణం మొదలగు అంశాలను చర్చించి పలు అగ్ర సంస్థలను ఏపీలో పెట్టుబడులు పెట్టేలా చంద్రబాబు ఒప్పించగలిగారు. కాగా జపాన్ లో నేడు తెలుగుసంఘం చంద్రబాబును సన్మానించనుంది. ఇక ఆ కార్యక్రమం అనంతరం బాబు జపాన్ నుండి బయలుదేరి నేరుగా అహ్మదాబాద్ కు చేరుకుంటారు, అక్కడ భారత వైద్య మండలి మాజీ అధ్యక్షుడు కేతన్ దేశాయ్ కుటుంబంలో జరిగే వివాహ కార్యక్రమానికి చంద్రబాబు హాజరు అయ్యి అనంతరం అర్ధరాత్రి హైదరాబాద్ కు చేరుకుంటారు.

Leave a Comment