న్యూయార్క్ లో మంచు తుఫాను

న్యూయార్క్ లో ఉష్ట్నోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోయింది. గత రెండురోజులుగా న్యూయార్క్ స్టేట్ లోని బఫెలో నగరంలో విపరీతంగా మంచు తుఫాను కురుస్తున్నది. దీంతో రోడ్లు మొత్తం మంచుతో నిండిపోయింది. రోడ్లపై దాదాపు రెండు నుంచి మూడు అడుగుల మేర మంచు పేరుకుపోయింది. ఈ మంచు తుఫాను కారణంగా ఇప్పటికే నగరంలో ఏడుగురు మరణించినట్టు తెలుస్తున్నది. మరికొన్ని కొన్ని రోజులపాటు మంచు తుఫాను కురిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. మంచు భారీ ఎత్తున రోడ్లపై పేరుకుపోవడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. రోడ్లపై పేరుకుపోయిన మంచును తొలిగించే ఏర్పాట్లు చేస్తున్నారు.

Leave a Comment