పంజాబ్ ఓటమి: ఫైనల్లో కోల్ కతా

kkrకోల్ కతా: గంభీర్ సేన ఐపీఎల్ -7 ఫైనల్లోకి దూసుకెళ్లింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ను కంగు తినిపించి తుదిపోరుకు కోల్ కలా నైట్ రైడర్స్ సిద్దమయింది. బుధవారమిక్కడ జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్ లో పంజాబ్ పై కోల్ కతా 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. వరుసగా 8 విజయాలు సాధించి గంభీర్ సేన ఫైనల్ కు చేరడం విశేషం.

ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్ కతా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. ఓపెనర్ రాబిన్ ఊతప్ప మరోసారి రాణించాడు. 30 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 42 పరుగులు చేశాడు. 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్లుకోల్పోయి 135 పరుగులు మాత్రమే చేసింది.

కోల్ కతా అన్ని విభాగాల్లో రాణించి పంజాబ్ ను కట్టడి చేసింది. మ్యాక్స్ వెల్(6), మిల్లర్(8) విఫలమవడంతో పంజాబ్ ఓటమి ఖాయమయింది. సాహా 35, వోహ్రా 26, బైయిలీ 26 పరుగులు చేశారు. కోల్ కతా బౌలర్లలో ఉమేష్ యాదవ్ 3, మోర్కల్ 2 వికెట్లు పడగొట్టారు. షకీబ్, చావ్లా చెరో వికెట్ తీశారు.

Leave a Comment