పడవ మునక: 66 మంది విదేశీయులు గల్లంతు

Boat capsizesకౌలాలంపూర్ : మలేషియా పశ్చిమ తీరంలో  97 మంది విదేశీ పర్యాటకులతో వెళ్తున్నపడవ గత అర్థరాత్రి బోల్తా పడింది. ఆ ప్రమాదంలో 66 మంది గల్లంతయ్యారు. మరో 31 మంది సురక్షితంగా ఒడ్డుకు చేరారని స్థానిక మీడియా బుధవారం వెల్లడించింది. మలేషియా పశ్చిమ తీరంలోని సన్నాగాయి ఎయిర్ హితమ్ సమీపంలో ఆ దుర్ఘటన చోటు చేసుకుందని వివరించింది.
 
పడవ ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న ప్రభుత్వం వెంటనే స్పందించింది. సహాయక చర్యలు వెంటనే చేపట్టాలని వివిధ శాఖల ఉన్నతాధికారులను ఆదేశించింది. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు తీవ్రం చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

Leave a Comment