పరిటాల అడుగుజాడల్లో..: చిన్నరాజప్ప

ప్రజలు, పోలీసుల మధ్య సంబంధాలు మెరుగుపరచడం కోసం గతంలో పోలీస్‌స్టేషన్లలో ఏర్పాటుచేసిన మైత్రీ సంఘాలను పునరుద్ధరిస్తామని హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. సోమవారం అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మైత్రీ సంఘాలను ఏర్పాటు చేశామన్నారు. వీటివల్ల గ్రామాల్లో పోలీసులు, ప్రజలకు మధ్య సంబంధాలు మెరుగుపడతాయని చెప్పారు. ఎర్రచందనం స్మగ్ల ర్ల ఆటకట్టించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిస్తామని చెప్పారు. వారానికో రోజు పోలీసులకు సెలవు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు.

అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా ఉప ముఖ్యమంత్రి సోమవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పట్టణంలో నూతన పోలీస్‌స్టేషన్‌ను, తాడిపత్రిలో పోలీసుల భవన సముదాయాన్ని ప్రారంభించారు. రామగిరిలో నిర్మించిన పోలీస్‌స్టేషన్‌ను మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డితో కలిసి ప్రారంభించారు. తిరుమలదేవర ఆలయంలో పూజలు చేశారు. వెంకటాపురం పరిటాల ఘాట్‌ వద్ద నివాళులర్పించారు. రామగిరిలో మూతపడిన బంగారు గనుల ప్రాంతాన్ని పరిశీలించారు.

Leave a Comment