పవన్ కళ్యాణ్ ” సీమాంధ్ర ఆత్మ గౌరవ సభ ” గర్జన

ప్రతక్ష్య రాజకీయాల లో దిగ నున్న పవన్ కళ్యాణ్

తెలుగు వారి ఆత్మ గౌరవ నినాదము తోతెలుగు వాడి మనసు దోచు కున్న ఆ నాటి ఎన్టీఆర్ ని, మా భాష తెలంగాణ, మా ప్రాంతము తెలంగాణ అన్న కెసిఆర్ తరహా లో పవన్ కళ్యాణ్
ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేక హోదా నినాదము తో సీమాంధ్రలు ముందు కు రా బోతున్నారా ?

ఈ రోజు కాకినాడ సభ లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ 1996 లో కాకినాడ లో బీజేపీ ఒక ఓటు ,రెండు రాష్ట్రాలు అన్న తీర్మానం గుర్తు చేసారు . వెంకయ్య నాయుడు 1972 లో జై ఆంధ్ర ఉద్యమము ద్వారా యువ కు లను ఎలా రెచ్చ కొట్టారో అని చెపుతూ , వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు అన్న గుర్తు చేసి కొంత ఉద్వేగము సభికుల లో కలుగ చేశారు . వెంకయ్య నాయుడు మాట్లాడే ప్రాస ను విమర్శిస్తూ గొడ్డు, గోదా, రైతు అంటారు అంటూ ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేక హోదా విషయము లో వెనక్కి తగ్గ వద్దు అని గట్టి గా చెప్పారు .
టీడీపీ పార్లమెంట్ సభ్యులు అవంతి శ్రీనివాస్ , మురళి మోహన్ మరియు టీజీ వెంకటేష్ ల ను కూడా వదిలి పెట్ట లేదు. పార్లమెంట్ సభ్యుడి గా రాజీనామా చేసి రండి , జన సేన మరల గెలిపించుకుంటుంది అని చెప్పారు .
పేరు పేరు నా అన్ని జిల్లా ల పేర్లు చెప్పి సీమాంధ్రల మీద వివక్ష ఎందుకు అని సభికులను ప్రశ్నించారు .

గడ్డం చేసు కున్నంత తేలిక గా ఆంధ్ర రాష్ట్ర విభజన పార్లమెంట్ సాక్షి గా చేసి ఈ రోజు సీమాంధ్ర కు ప్రత్యేక హోదా విషయము లో ఆంధ్ర పార్లమెంట్ సభ్యులు ఎందు కు చచ్చు దద్దములు లాగా ఉన్నారు అని ప్రశ్నిచ్చారు .

అన్నని, వదిన ని , కుటుంబము ని కూడా కాదు అని తెలుగు దేశం పార్టీ ని వెన్ను కాచాను అని పవన్ కళ్యాణ్ ఈ సభ లో బయట పడటము విశేషము.

ప్రత్యేక హోదా లేదు అని స్పెషల్ రాయితీలు అని చెప్పిన బీజేపీ , వాటి కి అంగీకరించిన టీడీపీ ఎలా ఎదురు కుంటాయో అని సీమాంధ్ర ప్రజలు అస్తక్తి గా ఉన్నారు.

Leave a Comment