పవన్ జోక్యంతోనే అక్కడ పోటీ లేదా?

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హుధూద్ తుఫాన్ బాధితులను పరామర్శించేందుకు విశాఖ వెళ్ళినప్పుడు ఆళ్ళగడ్డ ఉపఎన్నికల విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో చర్చించారని తెలుస్తున్నది. అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిని పోటీలోకి దించకూడదని పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు కోరినట్టు సమాచారం. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని పెట్టినప్పుటినుంచి పవన్ కళ్యాణ్ తో భూమా కుటుంబానికి సన్నిహిత సంబందాలు ఉన్నాయి. ఈ చొరవ కారణంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడితో మాట్లాడినట్టు తెలుస్తున్నది. తెలుగుదేశం పార్టీ గెలుపుకు ఒక కారణమైన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్సనల్ గా, ఆళ్ళగడ్డ ఉపఎన్నికల గురించి బాబుతో మాట్లాడటంతో.. బాబు కాదనలేకపోయారని తెలుస్తున్నది. శోభా నాగిరెడ్డి కూతురు అఖిలప్రియ ఈ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్నది. ఆళ్లగడ్డ నియోజక వర్గానికి ప్రస్తుటానికి ఒక్క నామినేషన్ మాత్రమే దాఖలు అయింది. గతంలో.. కృష్ణాజిల్లా నందిగామా నియోజక వర్గంలో ఉప ఎన్నిక జరిగినపుడు సానుభూతితో.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయలేదు. అదే సానుభూతిని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా ప్రదర్శించాలని పవన్ కళ్యాణ్ బాబును కోరినట్టు సమాచారం.

Leave a Comment