పవన్ నామస్మరణ చేసిన నాగార్జున !

నిన్న రాత్రి హైదాద్ శిల్పకళా వేదిక ప్రాంగణం పవన్ నామస్మరణతో హోరెత్తి పోయింది. నితిన్ హీరోగా నటించిన ‘చిన్నదానా నీకోసం’ ఆడియో ఫంక్షన్ కు అతిధిగా వచ్చిన నాగార్జునను టాలీవుడ్ మన్మధుడు అంటూ ఆకాశానికి ఎత్తేద్దామని యాంకర్ భార్గవి ప్రయత్నించి తన అతి పొగడ్తలతో నాగ్ ను వేదిక పైకి పిలిచింది. అయితే నాగార్జున తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ ‘పవన్ కళ్యాణ్ అభిమానులకు బాగున్నారా’ అని అనడంతో ఆడిటోరియం పవన్ నామస్మరణతో దద్దరిల్లి పోయింది.  అదేవిధంగా ఈ ఆడియో వేడుకలో ప్రసంగించిన అలీ మాట్లాడుతున్నప్పుడు కూడా అభిమానులు పవన్ పేరుతో గోలగోల చేసారు. ఇక ఈ సినిమా దర్శకుడు కరుణాకరణ్ గతంలో పవన్ తో ‘తొలిప్రేమ’ సినిమా తీసిన నేపధ్యంలో నితిన్ గురించి మాట్లాడుదామని కరుణాకరణ్ తన ప్రసంగాన్ని మొదలు పెట్టి అభిమానుల హడవిడిని చూసి ముందుగా పవన్ అభిమానులను పలకరించిన తరువాతే తాను తీసిన ‘చిన్నదానా నీకోసం’ గురించి మాట్లాడాడు.  పవన్ వీరాభిమాని నితిన్ నటించిన ఈ సినిమా ఆడియో వేడుకకు నితిన్ కోరికను మన్నించి పవన్ రాకపోయినా పవర్ స్టార్ మాత్రం అభిమానుల కేకల రూపంలో నిన్న జరిగిన ఆడియో ఫంక్షన్ లో అడుగడుగునా కనిపించడంతో పవన్ అభిమానులను నితిన్ ఏ రీతిగా సొంతం చేసుకున్నాడో అర్ధం అవుతుంది.  నాగార్జున మాట్లాడుతున్నప్పుడు అఖిల్ సినిమా గురించి కూడా అభిమానులు గోల చేసారు. దీనితో వెండితెర మన్మధుడు అంటూ యాంకర్ భార్గవి చేత పొగడ్తలు పొగిడించు కుంటూ ముసిముసి నవ్వులు నవ్వు కుంటూ వేదిక ఎక్కిన నాగ్ తన ఉపన్యాసంలో ఎక్కువ భాగం పవన్ అఖిల్ ల నామస్మరణ చేయవలసి రావడం చూస్తూ ఉంటే పవన్ మ్యానియా అఖిల్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్ధం అవుతుంది.

Leave a Comment