పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను పాకిస్తాన్ ల్యాండ్‌గా చూపించిన ఆరెస్సెస్ పత్రిక

pokరాష్ట్రీయ స్వయంసేవ సంఘ్‌కు చెందిన పత్రిక ఆర్గనైజర్ వీక్లీలో వచ్చిన ఓ చిత్రం వివాదాస్పదమైంది. ఆర్గనైజర్ తాజా పత్రికలో జమ్మూ కాశ్మీర్ పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను పాకిస్తాన్ భూభాగంలో భాగంగా చిత్రీకరించారు. ఇది తీవ్ర విమర్శలకు దారి తీసింది. రాజ్యసభలో శుక్రవారం నాడు ఈ అంశాన్ని విపక్షాలు లేవనెత్తాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ.. భారత్‌కు జమ్మూ కాశ్మీర్ కిరీటమని, దాని కోసం ఎందరో ప్రాణత్యాగాలు చేశారన్నారు.

ఆరెస్సెస్‌కు చెందిన పత్రికలో ఇలా రావడం అంటే ఆ భూభాగాన్ని పాకిస్తాన్లో కలపడం పట్ల ప్రభుత్వం సమ్మతించినట్లేనా అని ప్రశ్నించారు. దీని పైన కేంద్రమంత్రి రవిశంకర ప్రసాద్ స్పందించారు. దీని పైన విచారణ జరిపిస్తామని చెప్పారు. జమ్మూ కాశ్మీర్ భారత దేశంలో భాగమని, ఆర్గనైజర్ ప్రచురించిన పటం పైన విచారణ జరిపిస్తామని చెప్పారు. ఆర్గనైజర్ వ్యవహారంపై అందరు క్షమాపణలు చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.

Leave a Comment