కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం పట్ల ఇకపై భారత్ ఎంతమాత్రం సహించబోదని పాకిస్థాన్ కు హెచ్చరించారు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచే సంస్కృతికి తక్షణమే స్వస్తి చెప్పాలని, కాల్పులు ఆపకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. సోమవారం పాకిస్తాన్ మరో సారి తన వక్రబుద్ధిని బయటపెట్టింది. మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. పాక్ రేంజర్లు భారత సైన్యానికి చెందిన పది ఔట్ పోస్టులపై కాల్పులకు దిగారు. సామాన్య పౌరులున్న ప్రాంతాలపైనా ఈ కాల్పులు ప్రభావం చూపాయి. ఈ దాడుల్లో ఐదుగురు పౌరులు మృతి చెందారు. 26 మందికి గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో రాజ్ నాథ్ సింగ్ పాక్ తీవ్రస్థాయిలో హెచ్చరికలు ఇచ్చారు. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ పాక్ బలగాలు పదేపదే కాల్పులు కు దిగడంతో ఇరు దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
Recent Comments