పోలవరం గేట్ పనులు ప్రారంభం…


పోలవరం ప్రాజెక్టులో తొలి గేట్ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం ప్రారంభించారు…

తొలుత ముఖ్యమంత్రి పూజా కార్యక్రమాలు నిర్వహించి, ప్రాజెక్ట్ 41వ పిల్లర్ వద్ద భారీ క్రయిన్ల తో రేడియల్ గేట్ ను కదిలించి, కీలకమైన చివరి దశ పనులకు లాంఛనంగా శ్రీకారం చుట్టారు.
గేట్స్ ఉన్న ప్రాంతం నుండి కాపర్ డామ్ వద్దకు వెళ్ళి నిర్మాణంలో ఉన్న వివిధ పనులను పరశీలించి నిపుణులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం, గేట్ల స్థాపన కార్యక్రమానికి 13 జిల్లాల నుండి హాజరైన రైతులతో పోలవరం ఆనకట్ట ముందు జరిగిన భారీ భాహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు.

“నేనొక రైతు బిడ్డను, చిన్నప్పుడు మా పొలంలో నీళ్ళకోసం మడులు కట్టి నీళ్ళు మోసిన రోజులు ఇప్పుడు నాకు గుర్తుకు వస్తున్నాయి! ఈ ప్రాజెక్ట్ నిర్మించటం నా పూర్వ జన్మ సుకృతం. భవిష్యత్తులో ఇప్పుడు మీరు కూర్చుని ఉన్న ప్రాంతం అంతా పెద్ద పర్యాటక స్థలంగా మారబోతోంది”
ఈ ప్రాజెక్ట్ నిర్మాణం ఒకసారి ఆగితే తిరిగి ఎప్పటికీ మొదలవ్వని పరిస్థితులు ఉన్నాయి, ఎవరు అడ్డంకులు సృష్టించినా ఈ నిర్మాణం విజయవంతంగా పూర్తవ్వాలని కులమతాలకి అతీతంగా ప్రజలందరూ ప్రార్ధించాలని చంద్రబాబు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలను కోరారు.

జలవనరుల శాఖా మంత్రి శ్రీ దేవినేని ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ “పోలవరం ఆనకట్ట పరిధిలోని 7 మండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలపాలని ముఖ్యమంత్రి పట్టుబట్టటం వల్లే ఈ రోజు పోలవరం కల సాకారమయ్యింది” అన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, పితాని సత్యన్నారాయణ, జవహర్, స్థానిక ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు…

Posts per category:

Latest

అంతర్జాతీయం

అమెరికా

ఆధ్యాత్మికం

ఆరోగ్యం

ఆసియా

ఇతరములు

ఈవెంట్స్

ఓటు భారతం

క్రీడలు

జాతీయం

టెక్నాలజీ

ప్రాంతీయం

ఫోటో గేలరీ

బిజినెస్

యునైటెడ్ కింగ్డమ్

రాజకీయం

లైవ్ టీవీ

శుభాకాంక్షలు

సాహిత్యం

సినిమాలు

సైన్స్