ప్రణాళికా సంఘం స్థానే నీతి ఆయోగ్

ప్రణాళికా  సంఘం స్థానంలో ‘నీతి ఆయోగ్‌ (భారత్‌ పరివర్తనం కోసం జాతీయ సంస్థ – ఎన్‌ఐటిఐ) పేరిట ఒక సంస్థను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నది. పూర్వపు ప్రణాళికా సంఘం (పిసి) వలె కొత్త సంస్థకు ప్రధాని చైర్‌పర్సన్‌గా ఉంటారు. నీతి ఆయోగ్‌కు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్‌ గవర్నర్లతో కూడిన పాలక మండలి ఉంటుంది.

ప్రధా ని మోడీ ఇంతకు ముందు జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో  ఈ విషయ మై సంప్రదింపులు జరిపారు. వారిలో అధిక సంఖ్యాకులు సంస్థ పునర్నిర్మా ణం పట్ల సుముఖత కూడా వ్యక్తం చేశారు. మోడీ ప్రణాళికా సంఘం అధికా రులతో కూడా చర్చలు జరిపారు. 64 ఏళ్లుగా మనుగడ సాగిస్తున్న పిసి రద్దు గురించి ప్రకటించిన తరువాత ప్రధాని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక ‘సార్వత్రిక వేదిక’ ద్వారా కొత్త సంస్థపై అభిప్రాయాలను కోరారు.

 

Leave a Comment